హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి కె. నాగభారతి ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ప్రముఖ ప్రైవేటు సంస్థల్లోని సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీఏ విద్యార్హత కలిగి ఉండి 18 నుంచి 28 సంవత్సరాలలోపు పురుష అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి అర్హత గల వారు బుధవారం ఉదయం 10:30 గంటలకు ఫోటో సర్టిఫికెట్లలతో హాజరు కావాలని సూచించారు.