ఏయూ క్యాంపస్: ఏయూ వేదికగా శని,ఆదివారాల్లో మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 9 గంటలకు వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియం వేదికగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కా ర్పొరేషన్ డెరైక్టర్ డాక్టర్ కె.లక్ష్మీ నారాయణ, వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో విద్యార్థులను మంత్రి గంటా శ్రీ నివాసరావు నియామక పత్రాలను అందజేస్తారు. ఇప్పటి వరకు 12 వేల మంది విద్యార్థులు మేళా కోసం నమోదు చేసుకున్నారు. వీరికి మాత్రమే శనివారం జాబ్‌మేళా ఉంటుంది. ఆదివారం అందరూ పాల్గొనే అవకాశం ఉంది.
అర్హులు వీరే: బీటెక్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, ఎంబీఏ, డిప్లమో కోర్సులను చేసిన విద్యార్థులు దీనికి అర్హులు. జాబ్‌మేళాలో 14 సాఫ్ట్‌వేర్ సంస్థలు పాల్గొంటున్నాయి. విద్యార్థులు ఎటువంటి ప్రవేశ రుసుము చెల్లించనవసరం లేదు. 2013, 2014 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణత సాధిం చిన విద్యార్థులు సైతం ప్రాంగణ నియామకాలకు హాజరుకావచ్చు. విద్యార్థులు రెజ్యూమ్ కాపీలు, పాస్‌పోర్ట్ ఫొటోలు తీసుకురావలసి ఉంటుంది.
సంస్థ ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం
మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ న్యూక్లాస్ రూమ్ కాంప్లెక్స్
సైయింట్ ప్లేస్‌మెంట్ కార్యక్రమం
ఐఐటీ టెక్నాలజీస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం
యలమంచిలి సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రిన్సిపాల్ కార్యాలయ భవనం
మైక్రో జినిసిస్ జియో ఇంజినీరింగ్ విభాగం
ఏమ్‌జూర్ టెక్నాలజీస్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం
మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కెమికల్ ఇంజినీరింగ్ పీజీ బ్లాక్
ఇక్నోలైట్ టెక్నాలజీస్ ఎగ్జామినేషన్స్ సెల్
ఐనాట్ పవర్ టెక్నాలజీస్ ఇనుస్ట్రుమెంటేషన్ విభాగం
మేట్రిక్స్ సెక్యూరిటీ అండ్ సర్వైలెన్స్ కంప్యూటర్ సైన్స్ విభాగం
మైన్ ఫ్రేమ్స్ గ్లోబల్ టెక్నాలజీస్ కంప్యూటర్‌సైన్స్ విభాగం
స్టెలెంట్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రిన్సిపాల్ కార్యాలయం భవనం
నేటి నుంచి ఏయూలో జాబ్‌మేళా
Published Fri, Mar 6 2015 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement
Advertisement