
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలోని నిరుద్యోగులైన యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 22న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ కే.రవికుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ఎస్‌పీ రోడ్డులోని హరిహర కళాభవన్ ఆడిటోరియంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు కలిగి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చుని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇంర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో ఉచితంగా శిక్షణలు ఇచ్చిన మీదట ఉద్యోగ అవకాశాలు చూపించనున్నట్టు చెప్పారు. కస్టమర్‌కేర్ ఎగ్జిక్యూటివ్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు, యానిమేటర్లు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, డొమెస్టిక్‌వాయిస్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఎలక్ట్రీషిన్ తదితర కోర్సుల్లో శిక్షణలు ఇవ్వనున్నట్టు డీసీ చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 22న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హరిహరకళాభవన్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని డీసీ కోరారు. మరిన్ని వివరాలకు 9705092502, 9010650188.