హైదరాబాద్:
నగరంలో ఉద్యోగాల పేరిట మరో భారీ మోసం బయటపడింది. గేట్‌మై జాబ్స్ డాట్‌కామ్, అద్వేతియా శ్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిరుద్యోగుల నుంచి రూ. 200 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ లిటిల్‌ఫ్లవర్ కళాశాలలో జాబ్‌మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరయ్యారు. అక్కడికి చేరుకున్న నిరుద్యోగులకు ఇదంతా అబద్ధమని తేలడంతో.. వారంతా ఆగ్రహానికి గురై రోడ్డెక్కారు. దీంతో ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.