little flower college
-
ఉప్పల్‌లో ఉద్రిక్తత
-
ఉప్పల్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలో ఉద్యోగాల పేరిట మరో భారీ మోసం బయటపడింది. గేట్‌మై జాబ్స్ డాట్‌కామ్, అద్వేతియా శ్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆన్లైన్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిరుద్యోగుల నుంచి రూ. 200 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ లిటిల్‌ఫ్లవర్ కళాశాలలో జాబ్‌మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరయ్యారు. అక్కడికి చేరుకున్న నిరుద్యోగులకు ఇదంతా అబద్ధమని తేలడంతో.. వారంతా ఆగ్రహానికి గురై రోడ్డెక్కారు. దీంతో ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
కళాశాలకని వెళ్లి.. విద్యార్థిని అదృశ్యం
చిక్కడపల్లి(హైదరాబాద్): కళాశాలకని వెళ్లిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..అశోక్‌నగర్‌లోని ఎస్ఆర్టీలో యూసుఫ్, పూనమ్ చౌబె దంపతులు కూతురు సోని(16) కలసి ఉంటున్నారు. సోని ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి కళాశాలకు వెళ్లింది. సాయంత్రం తిరిగి రాకపోయే సరికి ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను అశ్రయించారు. తల్లి పూనమ్చౌబె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు వివరాలకు 040-27853578, 9490616323, 9490616401 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు. -
వరాహాల నగర్..!
శాంతినగర్‌లో పందుల సైర్వవిహారం పొంచి ఉన్న వ్యాధులు చోద్యం చూస్తున్న మున్సిపల్ యంత్రాంగం నల్లగొండ టౌన్ పట్టణంలోని శాంతినగర్‌లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్తకుప్పలు, డ్రెయినేజీల వద్ద గుంపులుగుంపులుగా తిరుగుతూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయి. ఈ కా రణంగా దోమల వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది కేవ లం లిటిల్ ఫ్లవర్ కాలేజీ ప్రధాన రోడ్డు వెంట మాత్రమే శుభ్రం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మురుగు కాల్వల నిర్వహణ ను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.వెరసి ఆయా ప్రాంతా లు అపరిశుభ్రంగా మారి పందులకు ఆవాసాలుగా మారుతున్నా యని ఆవేదన చెందుతున్నారు. ఒక్క శాంతినగర్‌లోనే సుమారు 500 పందులు ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. జానావాసాల్లో పందుల పెంపకం చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయి. ఒక వేళ ఎవరైనా పెంచినా మున్సిపల్ అధికారులు వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పె ద్ద సంఖ్యలో పందులు స్వైర విహారం చేస్తున్నా అధికారులు నిమ్మ కు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. పెంపకందారుల నుంచి మున్సిపల్ సిబ్బంది మామూళ్లు తీసుకుంటూ పందులను అరికట్టడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించాలని శాంతినగర్‌వాసులు కోరుతున్నారు.