కళాశాలకని వెళ్లిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
చిక్కడపల్లి(హైదరాబాద్): కళాశాలకని వెళ్లిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..అశోక్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌టీలో యూసుఫ్, పూనమ్ చౌబె దంపతులు కూతురు సోని(16) కలసి ఉంటున్నారు. సోని ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి కళాశాలకు వెళ్లింది.
సాయంత్రం తిరిగి రాకపోయే సరికి ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను అశ్రయించారు. తల్లి పూనమ్‌చౌబె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు వివరాలకు 040-27853578, 9490616323, 9490616401 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.