సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరపనున్న జాబ్ మేళా పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు.
జాబ్‌మేళా పోస్టర్ విడుదల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మదిలో మెదిలిన ఆలోచనే ఈ జాబ్ మేళా. సీఎం జగన్ ఆదేశాల మేరకే తిరుపతి, విశాఖలో తొలి రెండు విడతల్లో జాబ్ మేళా నిర్వహించాం. మూడో విడతగా నాగార్జున యూనివర్సిటీలో ఈ జాబ్ మేళా మే 7,8 తేదీల్లో జరుగుతుంది. ఇప్పటివరకు తిరుపతి, విశాఖలో 10వేల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుంటే 30వేల ఉద్యోగాలు వచ్చాయి. విశాఖలో 23వేల మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఏఎన్‌యూలో జరిగే మేళాలో 148 కంపెనీలు, 70 వేల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో 4 లక్షల వరకు ఉద్యోగాలిచారు. ఇప్పుడు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. ఎంపికైన విద్యార్థుల ముఖాల్లో కొత్త కాంతులు కనిపించడం ఆనందంగా ఉంది. సంక్షేమ పథకాలతో పాటు పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగంలో సమానంగా అబివృద్ది కోసం కృషి చేస్తున్నాం. రాబోయే రెండేళ్లలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తాం.. ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేరుస్తాం' అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
చదవండి👉🏼 (సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం)
Comments
Please login to add a commentAdd a comment