సాక్షి, సిటీబ్యూరో: రాజీవ్ యువ కిరణాలు పథకం కింద నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 20, 21తేదీల్లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. ఇందులో 2119 పోస్టుల (597 టెక్నికల్, 1522 నాన్‌టెక్నికల్)ను భర్తీ చేయనున్నట్టు చెప్పారు.
మల్లేపల్లిలోని అన్వర్ ఉలుమ్ డిగ్రీ కళాశాల్లో జరిగే ఈ మేళాకు టెన్త్ పాస్/ఫెయిల్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇతర టెక్నిల్ అర్హతలు గలవారు హాజరు కావచ్చు. భారత్ ఇంజినీరింగ్, రెడ్డీస్ ల్యాబ్స్, ఫుడ్‌వరల్డ్, భారత్ వాల్‌మార్ట్, మెట్రో, సూర్యవంశీ స్పినింగ్ మిల్స్, వరుణ్‌మోటార్స్, ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్, కన్‌కార్డ్ మోటార్స్, వోక్స్‌వ్యాగన్, అమృతాంజన్ హెల్త్‌కేర్, హెరిటేజ్‌ఫుడ్స్ తదితర సంస్థలు ఇందులో పాల్గొంటాయి.
20, 21తేదీల్లో మెగా జాబ్ మేళా
Published Wed, Dec 18 2013 6:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement