
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న, వచ్చే నెల 1న గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైబర్‌నెట్ చైర్మన్ పూనూరి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ట్రేడ్ యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది.
ముఖ్య అతిథి అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. జాబ్‌మేళాలో 80 కంపెనీలు పాల్గొంటున్నాయని, పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి ఉద్యోగాలిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ, ట్రేడ్ యూనియన్ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment