mega job mela
-
విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: గతేడాది వైఎస్సార్సీపీ తరఫున 4 వర్శిటీల్లో జాబ్ మేళాలు నిర్వహించి 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు దేశవ్యాప్తంగా ఉన్న 100 ప్రముఖకంపెనీలు ప్రతినిధులు హాజరయ్యారు.10 వేలకుపైగా ఉద్యోగావకాశాలే లక్ష్యంగా రెండు రోజుల పాటు జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ‘‘విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. ప్రతి విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒక రంగంలో రాణించేందుకు ప్రయత్నించాలి’’ అని సూచించారు. చదవండి: రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు -
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ
ఖమ్మం మయూరిసెంటర్: దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. మరోపక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మొదటి స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాల ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు తిండి గింజల కోసం పక్క రాష్ట్రాలవైపు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ ముందుందన్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగం పొందలేరని, అలాంటి వారి కోసం జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మంలో పోలీస్ శాఖ ఆధ్వర్యాన 140 కంపెనీలతో 8,120 మందికి ఉద్యోగాలు ఇప్పించేలా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వీ.పీ.గౌతమ్‌తో పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
Mega Job Fair: కొవ్వూరులో 9న మెగా జాబ్‌మేళా
కొవ్వూరు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం దీనికి సంబంధించిన పోస్టరును ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా వనిత మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. 15 ప్రముఖ కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. 1,367 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎస్సీ కెమీస్ట్రీ, బీకామ్, పదో తరగతి, ఎంఫార్మసీ,బీ ఫార్మసీ, డీఫార్మసీ, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న 19 నుంచి 30ఏళ్ల లోపు యువతీ యువకులంతా జాబ్ మేళాను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆయా కంపెనీలు వేతనం చెల్లిస్తాయన్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ముందుగాపూర్తి వివరాలతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్ధులు తమ ఆధార్, పాన్, ఇతర సర్టిఫికెట్స్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు. వివరాల కోసం 6303889174, 96664 72877, 90596 41596 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యావృద్ధికారి శీలం ప్రశాంత్, జేడీ ఎం. సుమలత, ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) జగనన్న పాలనలో బీసీలకు ప్రాధాన్యం చాగల్లు: బీసీల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లు మండలం ఊనగట్లలో నియోజకవర్గ బీసీ నాయకులతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభకు అధిక సంఖ్యలో తరలి రావాలని మంత్రి పిలుపు నిచ్చారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు సంసాని రమేష్, పొన్నాడ సింహాద్రి, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు వైఎస్సార్సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకా రాజు, ఎం.పోసిబాబు, కట్టా బ్రాహ్మజీ, వైఎస్సార్సీపీ బీసీ నాయకులు అక్షయపాత్ర రవింద్ర శ్రీనివాస్, మట్టా వెంకట్రావు, పిల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: నేనూ బీసీ ఇంటి కోడలినే.. మంత్రి రోజా) -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 20న మెగా జాబ్‌మేళా.. పూర్తి వివరాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీ శనివారం మైలవరంలోని డాక్టర్ లక్కిరెడ్డి హానిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఉపాధి శాఖాధికారి డాక్టర్ పీవీ రమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు ఈ మేళాలో 16 ప్రైవేటు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరై వారి కంపెనీల్లోని వివిధ విభాగాల్లో 1,900 పోస్టులను భర్తీ చేస్తారని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటుగా ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్ విద్యార్హతలు ఉన్న వారు ఈ మేళాలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 20వ తేదీలోగా ఆన్లైన్లో గాని 86888 42879, 99660 90377 నంబర్లలో కాని పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. పేర్లు నమోదు చేసుకోలేకపోయిన వారు శనివారం జాబ్ మేళా జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. -
సీఎం జగన్ ఆశయం.. పార్టీ లక్ష్యం తప్పక నెరవేరుతాయి
సాక్షి, వైఎస్సార్: ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదవాలన్నది సీఎం జగన్ ఆశయమని, రాష్ట్రంలో నిరుద్యోగి ఉండకూడదన్నది వైఎస్సార్సీపీ లక్ష్యమని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరు సీబీఐటీలో శనివారం ఉదయం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్య ప్రతి ఒక్కరి అవసరం. ఉద్యోగాల కోసం ప్రతీ ఒక్కరూ పోటీ పడుతున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగం పొందితేనే కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారాయన. అలాగే.. ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొవాలని, ఇప్పుడు రానంత మాత్రాన మళ్లీ అవకాశం ఉంటుందని, బాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని విజయసాయిరెడ్డి యువతకు భరోసా ఇచ్చారు. జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు పాల్గొనగా.. ఉద్యోగాల కోసం 13 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో.. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఆధర్వ్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు అపూర్వ స్పందన లభిస్తోందని డిప్యూటీ సీఎం అమ్జాద్ బాషా పేర్కొనగా.. జగన్ ఆశయ సాధనకు అనుగుణంగా జాబ్ మేళా నిర్వహిస్తామని, నిరుద్యోగిరహిత లక్ష్య సాధన కోసం పార్టీ కృషి చేస్తుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. -
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేది పల్లవోలు సమీపంలోని సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె. సురేష్ బాబు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం అపూర్వ కల్యాణ మండపంలో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 4లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 42వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జిల్లాకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని, బద్వేల్లో సెంచరీ ప్లైవుడ్ కంపెనీ రూ.1000 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోందన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో రూ.800 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, 15 కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయన్నారు. ఈనెల 25వ తేదీ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సీబీఐటీలో నిర్వహించే జాబ్‌మేళాలో 250 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకూ చదివిన నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఒకరు ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు రామమోహన్‌రెడ్డి, రాణాప్రతాప్, నాగేంద్ర, దత్తసాయి, రహీమ్, యల్లారెడ్డి, షఫీ పాల్గొన్నారు. -
25న సీబీఐటీలో వైఎస్సార్సీపీ మెగా జాబ్ మేళా
చాపాడు(వైఎస్సార్ జిల్లా): చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో 25న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సీబీఐటీలో శుక్రవారం మీడియాతో మాట్లాడి, జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్సైట్ ((WWW.YSRCPJOBMELA.COM))ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. చదవండి: ఊపందుకుంటున్న ‘ఊళ్లు’ ఇప్పటికే తిరుపతి, వైజాగ్, గుంటూరులో జాబ్ మేళాల ద్వారా 40,243 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు పొత్తులు ఉన్నా లేకున్నా తమ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని, సుపరిపాలన అందించే తమ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 స్థానాల్లో గెలిపిస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రజలకు ఉపయోగకరంగా ఏదీ ఆలోచించరని, అది వారికి పుట్టుకతో వచ్చిందని, ప్రతి దాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తారని విజయసాయిరెడ్డి విమర్శించారు. -
మే 1, 2 తేదీల్లో వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా
తెనాలి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఇంజినీరింగ్ కాలేజిలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారికి మే 1, 2 తేదీల్లో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. ఏఎస్ఎన్ కాలేజి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలోను శ్రద్ధ వహిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల తిరుపతి కేంద్రంగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ జాబ్‌మేళా నిర్వహించినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు ఏఎన్‌యూలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల వారికి ఇది మంచి అవకాశమన్నారు. పార్టీ తరఫున కంపెనీలను ఆహ్వానించి జాబ్‌మేళా నిర్వహించటం రాజకీయాల్లో కొత్త అధ్యాయమని చెప్పారు. తెనాలి నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత డేటా సేకరించామన్నారు. జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. (క్లిక్: ‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు) -
గుంటూరు: 30న, మే 1న మెగా జాబ్‌మేళా
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న, వచ్చే నెల 1న గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైబర్‌నెట్ చైర్మన్ పూనూరి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ట్రేడ్ యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథి అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. జాబ్‌మేళాలో 80 కంపెనీలు పాల్గొంటున్నాయని, పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి ఉద్యోగాలిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ, ట్రేడ్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. -
జాబ్ మేళా నిరంతర ప్రక్రియ
తిరుపతి ఎడ్యుకేషన్/మంగళం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తొలగిపోయే వరకు కొనసాగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వేదికగా రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించే లక్ష్యంతో రెండు రోజుల మెగా జాబ్ మేళాను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. అందుకు అనుగుణంగా రాష్టంలోని మూడు ప్రాంతాలైన తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులలో జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న జాబ్‌మేళాపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, అలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ‘సినీ నిర్మాత బండ్ల గణేష్ గురించి మాట్లాడి నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోను. బుద్దా వెంకన్న బుద్ధి లేని వెంకన్న.. పనికి మాలిన వెధవల గురించి మాట్లాడను’ అని వ్యాఖ్యానించారు. 4,784 మందికి ఉద్యోగాలు ► తిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు రాయలసీమ నుంచి 47 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలిరోజు జాబ్ మేళాకు పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు మొత్తం 15,750 మంది హాజరయ్యారు. ► పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్హతతో 7,500 మంది హాజరు కాగా, వారిలో 2,347 మంది ఎంపికయ్యారు. డిగ్రీ విద్యార్హతతో 5,700 మంది హాజరు కాగా 1,700 మంది.. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు 737 మంది.. మొత్తంగా 4,784 మంది అభ్యర్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ► ఐటీ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు 737 మందిలో శనివారం సాయంత్రం 410 మందికి ఎంపీలు విజయసాయిరెడ్డి, గురుమూర్తి చేతుల మీదుగా ఆఫర్ లెటర్లను అందజేశారు. ఉద్యోగాలు సాధించిన వారందరికీ వారంలోపు ఈమెయిల్, పోస్టు ద్వారా ఆఫర్ లెటర్లు అందుతాయి. ► ఇదిలా ఉండగా పచ్చ పత్రికలు నిస్సిగ్గుగా అవాస్తవాలు వల్లిస్తున్నాయని జాబ్ మేళా తిరుపతి ఇన్చార్జ్ దేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారా.. అని ప్రశ్నించారు. ► జాబ్ మేళాలో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు, పలమనేరు ఎమ్మెల్యేలు ఆదిమూలం, వెంకటే గౌడ్, ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ చిన్నా వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. తొలి ప్రయత్నంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్న తరుణంలో జగనన్న పార్టీ తరఫున ఉద్యోగ మేళా నిర్వహించారు. గొప్ప కంపెనీలు ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొదటి అటెమ్ట్‌లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యాను. తక్షణమే ఆఫర్ లెటర్ అందించారు. సంతోషంగా ఉంది. – పల్లవి, బద్వేల్ నిరుద్యోగులకు వరం చదువుకొని ఉద్యోగం లేకుండా ఉంటున్న వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ సంస్థల ద్వారా జాబ్ మేళా నిర్వహించడం శుభ పరిణామం. నాలాంటి ఎంతో మందికి ఇక్కడ అవకాశం దక్కింది. ఉద్యోగం సంపాదించానని గర్వంగా ఉంది. జగనన్నకు రుణపడి ఉంటా. – గౌతమి, పుంగనూరు మంచి అవకాశం చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి ఉద్యోగ మేళా ఎవ్వరూ నిర్వహించ లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంత పెద్ద జాబ్‌మేళా నిర్వహించడం ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులకు మంచి అవకాశం. జాబ్‌మేళా ద్వారా ఉద్యోగం సంపాదించా. గర్వంగా ఉంది. – చరణ్‌తేజ, నెల్లూరు -
Mega Job Mela: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘ఉపాధి విప్లవం’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెంచేదిశగా యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో విస్తృత ఉద్యోగాల కల్పన కోసం.. అభివృద్ధి వికేంద్రీకరణ మేరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న ఈ మెగా జాబ్‌మేళాల ద్వారా 25 వేలమందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. చదవండి: అన్నదాతల ‘ఆత్మ’ సాక్షిగా రాజకీయం! శని, ఆదివారాల్లో (16, 17 తేదీల్లో) తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా యువత కోసం వైఎస్సార్సీపీ జాతీయ, అంతర్జాతీయంగా పేరుగాంచిన 147 కంపెనీలను పిలిపించి జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ మేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా 1.47 లక్షల మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చెప్పారు. శని, ఆదివారాల్లో తిరుపతిలోను, 23, 24 తేదీల్లో విశాఖ ఆ«ం«ధ్ర యూనివర్సిటీలో, ఈనెల 30, మే 1వ తేదీ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఈమేళాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. శనివారం తిరుపతి, వైఎస్సార్, రాజంపేట, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు, ఆదివారం అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల వారు ఈమేళాలో పాల్గొనాలని సూచించారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయి కన్ఫర్మేషన్ లెటర్ వచ్చినవారు మాత్రమే హాజరుకావాలన్నారు. తిరుపతిలో నిర్వహించే జాబ్‌మేళాకు 40 వేలమందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. మూడేళ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 6 లక్షలకుపైగా ఉద్యోగాలు ఉద్యోగాల కల్పనలో ఏపీ ముందంజలో ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే ఆరులక్షలకుపైగా ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనన్నారు. 2.50 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, ఆర్టీసీలోని 52 వేలమంది ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నారని, 2.60 లక్షల వలంటీర్ల పోస్టులు ఇచ్చారని, ఆప్కోస్ ద్వారా 95 వేలమందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. వీటితో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పిస్తూ 75% మంది స్థానికులకే ఉద్యోగాలను అందించేందుకే జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. మూడేళ్లలో 30 సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని చెప్పారు. బాబూ ఎప్పుడైనా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించావా? ‘చంద్రబాబు తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారుగానీ.. వాస్తవానికి 44 ఇయర్స్ ఇండస్ట్రీ. అయితే ఏం ప్రయోజనం? తాను తొమ్మిదేళ్లు సమైక్యాంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా చేసినప్పుడుగానీ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడుగానీ ఒక్కరికైనా జాబ్‌లు ఇప్పించారా.. కనీసం ఇలాంటి మేళాలు ఎప్పుడైనా నిర్వహించారా..’ అని ప్రశ్నించారు. నూతన చరిత్రకు నాంది పలికేలా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళాను చూసి చంద్రబాబుకి టీడీపీ నేతలకు వణుకుపుడుతోందన్నారు. వారు చేయరు, ఎవరైనా చేస్తే ఓర్చుకోలేని వింత వ్యాధితో పప్పునాయుడు, తుప్పునాయుడు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లలో చంద్రబాబుహయాంలో కేవలం తన సామాజికవర్గానికి చెందిన అనుకూలురకే లబ్ధిచేకూర్చుకున్నారని విమర్శించారు. తాము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలు, రాజకీయాలు, కులాలకతీతంగా ఎన్నో మేళ్లు చేస్తున్నామని చెప్పారు. 2024లో టీడీపీ సమాధి ఖాయం రానున్న ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమా అని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. ఒంటరిగా పోటీచేసినా, పొత్తులతో పోటీచేసినా 2024 ఎన్నికల్లో మళ్లీ చావు దెబ్బతిని.. టీడీపీ సమాధి కావడం ఖాయమని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న పప్పు నాయుడు లోకేశ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నది నిజమే అయితే.. తన తండ్రి పేరుని, తాను పోటీచేసిన నియోజకవర్గం మంగళగిరినిసరిగ్గా పలికించాలని సూచించారు. కుప్పంలో కూడా జాబ్‌మేళా పెడతాం చంద్రబాబు అడిగితే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేశామని, ఆయన అడిగితే కుప్పంలో కూడా ఇలాంటి జాబ్‌మేళాలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రతి నియోజకవర్గంలో జాబ్‌మేళాలు
సాక్షి, నరసన్నపేట: డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ మేళాలో 30 కంపెనీ ప్రతినిధులు పాల్గొనగా, జిల్లా వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. 4,723 మంది నిరుద్యోగులు తమ అభ్యరి్థత్వాన్ని నమోదు చేసుకోగా, వీరిలో 1,653 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. మరో 432 మంది విశాఖపట్నంలో శిక్షణకు పంపారు. ముందుగా ఈ మేళాను ప్రారంభించిన ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో దేశ చరిత్రలోనే నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రుజువైందన్నారు. అదేవిధంగా పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రతీ నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు ఏర్పాటు చేసి వందలాది మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. జాబ్‌మేళాకు హాజరైన నిరుద్యోగులు ఉపాధి జ్యోతిని వినియోగించుకోండి.. ఆగస్టు 23న ప్రారంభించిన ఉపాధి జ్యోతి పథకాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని మంత్రి కృష్ణదాస్ కోరారు. ఈ వెబ్సైట్లో జిల్లా నుంచి 30 వేల మంది, నరసన్నపేట నియోజకవర్గం నుంచి 5,300 మంది నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ వెబ్సైట్లో నమోదు చేసుకున్న వారికి జాబ్‌మేళాలో ప్రాధాన్యమిస్తామన్నారు. పార్టీ యువజన విభాగం ప్రతినిధి ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రతీ ఆర్నెల్లకోసారి నరసన్నపేటలో జాబ్‌మేళా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పరిశీలించిన కలెక్టర్.. జాబ్‌మేళా నిర్వహణ తీరును కలెక్టర్ జే నివాస్ పరిశీలించారు. ఇక్కడ నిరుద్యోగులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అధిక మంది నిరుద్యోగులను ఎంపిక చేయాలని కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కల్యాణచక్రవర్తి, నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్ గోవిందరావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కరిమి రాజేశ్వరి, సీడాప్ మేనేజర్ రామ్మోహన్, వైఎస్సార్సీపీ నాయకులు చింతు రామారావు, ఆరంగి మురళి, మెండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కందుకూరులో మెగా జాబ్‌మేళా
-
21న మెగా జాబ్‌మేళా
కడప ఎడ్యుకేషన్: డిసెంబర్ 21వ తేదీ శుక్రవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎం బీఏ, ఎంసీఏ, పీజీ అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలి పారు. ఈ ఎంపికలను కడప చిన్నచౌక్ వై జంక్షన్ వద్ద గల గురుకుల విద్యాపీఠ్, ఏవీఆర్స్కూల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు. -
నేర రహిత సమాజమే ధ్యేయం
► నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి చాదర్‌ఘాట్: నేర రహిత సమాజ స్థాపనే పోలీసుల లక్ష్యమని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఈస్ట్ జోన్ పోలీ సుల ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్ ఇంపీరియల్ గార్డెన్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. నగర కమిషనర్ మహేందర్ రెడ్డి ఈ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యోగం దక్కించుకోవటం మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుం దని, దీనిని దృష్టిలో పెట్టుకొని యువత తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు యత్నించాలని కమిషనర్ సూచిం చారు. ప్రైవేట్ మార్కెట్లో వచ్చిన మార్పుల వల్ల జాబ్‌ల సంఖ్య బాగా పెరిగిందని, యువత మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో స్థిరపడాలని అన్నారు. సహనం, ఓర్పుతో అడుగులు వేస్తూ యువత లక్ష్యాలు చేరుకోవాలి తప్ప నేరమార్గంలో పయనించరాదన్నారు. యువతలో సాఫ్ట్ స్కిల్స్ పెంపొందితే దేశ సంపద వృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ రవీంద్ర మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగానే ఈజాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 500 వందల మంది యువతీయువకులు ఈ మేళాకు హాజరు కాగా.. వీరిలో రెండు వందల మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ జి.చక్రవర్తి, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, ఈస్ట్ జోన్ పరిధిలోని తొమ్మిది మంది సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
26న ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా
కేయూ క్యాంపస్ : హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 26న మెగా జాబ్‌మేళా ని ర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కె.రామానుజరావు శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల బా ధ్యులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నా రు. ఎస్సెస్సీ నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి వి ద్యార్హతలను బట్టి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఆయా కంపెన్నీల్లో ట్రెయినీలుగా పనిచేసేందుకు ఎంపిక చేసిన వారికి పదమూడు వారాల నుంచి పది నెలల వర కు పాటు శిక్షణ ఉంటుందని వివరించారు. ఈ మేరకు విద్యార్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా కోరారు.