జాబ్‌మేళా పోస్టర్
కడప ఎడ్యుకేషన్: డిసెంబర్ 21వ తేదీ శుక్రవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎం బీఏ, ఎంసీఏ, పీజీ అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలి పారు. ఈ ఎంపికలను కడప చిన్నచౌక్ వై జంక్షన్ వద్ద గల గురుకుల విద్యాపీఠ్, ఏవీఆర్‌స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment