మే 1, 2 తేదీల్లో వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా | Mega Job Mela to be Held at Nagarjuna University on 1 And 2 May | Sakshi
Sakshi News home page

Guntur: మే 1, 2 తేదీల్లో వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా

Published Sat, Apr 23 2022 12:14 PM | Last Updated on Sat, Apr 23 2022 2:44 PM

Mega Job Mela to be Held at Nagarjuna University on 1 And 2 May - Sakshi

తెనాలి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఇంజినీరింగ్‌ కాలేజిలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారికి మే 1, 2 తేదీల్లో నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆవిష్కరించారు. ఏఎస్‌ఎన్‌ కాలేజి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలోను శ్రద్ధ వహిస్తున్నట్టు చెప్పారు.

ఇటీవల తిరుపతి కేంద్రంగా పార్టీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ జాబ్‌మేళా నిర్వహించినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు ఏఎన్‌యూలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల వారికి ఇది మంచి అవకాశమన్నారు.

పార్టీ తరఫున కంపెనీలను ఆహ్వానించి జాబ్‌మేళా నిర్వహించటం రాజకీయాల్లో కొత్త అధ్యాయమని చెప్పారు. తెనాలి నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత డేటా సేకరించామన్నారు. జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. (క్లిక్: ‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement