annabattuni Sivakumar
-
చంద్రబాబుకి బుద్ధి చెప్తాం..జగన్ ని గెలిపించుకుంటాం
-
మే 1, 2 తేదీల్లో వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా
తెనాలి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఇంజినీరింగ్ కాలేజిలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారికి మే 1, 2 తేదీల్లో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. ఏఎస్ఎన్ కాలేజి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలోను శ్రద్ధ వహిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల తిరుపతి కేంద్రంగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ జాబ్‌మేళా నిర్వహించినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు ఏఎన్‌యూలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల వారికి ఇది మంచి అవకాశమన్నారు. పార్టీ తరఫున కంపెనీలను ఆహ్వానించి జాబ్‌మేళా నిర్వహించటం రాజకీయాల్లో కొత్త అధ్యాయమని చెప్పారు. తెనాలి నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత డేటా సేకరించామన్నారు. జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. (క్లిక్: ‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు) -
తెనాలిని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం
-
చెట్టు రూపంలో మృత్యువు
సాక్షి, తెనాలి(గుంటూరు) : అప్పటి వరకు తోటి విద్యార్థులతో పాఠశాలలో సందడిగా గడిపిన ఆ చిన్నారిని మరో రెండు నిమిషాల్లో ఇంటి వెళ్తున్న క్రమంలో చెట్టు రూపంలో మృత్యువు కబళించింది. చెట్టు విరిగి పడటంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని వైద్యశాలకు తరలిస్తుండగా తల్లి ఒడిలోనే మృతి చెందిన విషాద ఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తెనాలి పట్టణ మారిస్‌పేటలోని మఠం బజారులో ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలోని యూకలిఫ్టస్ చెట్టు విరిగి పడటంతో విద్యార్థి భీమవరపు యువసందీప్ రెడ్డి(6) తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పాఠశాల వదిలిపెట్టడంతో తోటి విద్యార్థులందరూ ఇళ్లకు వెళుతున్నారు. ఒకటో తరగతి చదువుతున్న సందీప్ ఉపాధ్యాయులకు వీడ్కోలు పలుకుతున్న విద్యార్థుల వరుసలో చివరన ఉన్నాడు. తరగతి గది నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా చెట్టు విరిగి పడింది. ఈ క్రమంలో చిన్నారి కుడి కాలు విరిగింది. వెంటనే ఉపాధ్యాయులు సమీపంలోని విద్యార్థులను పక్కకు లాగి, సందీప్‌ను చెట్టు కింద నుంచి పైకి తీశారు. కుమారుడు గాయపడిన విషయాన్ని తెలుసుకున్న తల్లి వీరకుమారి, స్థానికులు పాఠశాల వద్దకు వచ్చి సందీప్‌ను తెనాలి జిల్లా వైద్యశాలకు ఆటోలో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అలాగే వైద్యశాలకు తరలించగా.. డాక్టర్లు పరీక్షించి బాలుడు మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ మృతికి తండ్రి భీమవరపు సుబ్బరామిరెడ్డి, తల్లి కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డ దేహాన్ని పట్టుకుని వారు విలపించిన తీరు కంట తడి పెట్టించింది. సందీప్ అన్నయ్య మణికంఠ అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఘటన ప్రాంతానికి సమీపంలోనే ఉండటంతో మణికంఠ చెవికి చెట్టు కొమ్మలు రాసుకుపోయాయి. కడుపు కోత.. సుబ్బరామిరెడ్డి, వీరకుమారి దంపతులు నిరుపేదలు. కరెంటు పనుల మేస్త్రిలకు సహాయకుడిగా పని చేస్తూ సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చిన్న వాడైన సందీప్‌కు ఐదేళ్లు నిండటంతో కొద్దిరోజుల కిందట ఒకటో తరగతిలో చేర్పించారు. పాఠశాలలో బూట్లు, పుస్తకాలు ఇవ్వడంతో ఆ చిన్నారి ఉత్సాహంగా అన్నతో కలిసి స్కూలుకు వెళుతున్నాడు. చదువుకుని ప్రయోజకుడై కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశపడిన తల్లిదండ్రులకు కడపుకోత మిగిలింది. ఎమ్మెల్యే పరామర్శ.. ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హుటాహుటిన వైద్యశాలకు చేరుకుని చిన్నారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కడుపుకోతతో వేదనపడుతున్న తల్లిదండ్రులను ఓదార్చారు. పురపాలక సంఘం నంచి తక్షణమే రూ.రెండు లక్షలు బాధిత కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. అలాగే అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేయాలని, విద్యార్థులకు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
జననేతపై అక్షరాభిమానం
సాక్షి, హైదరాబాద్ : ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర నేటికి 196వ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ చేస్తున్న యాత్ర ఇటీవలే చింతపల్లి క్రాస్ వద్ద 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. నాలుగేళ్ల టీడీపీ ప్రజాకంటక పాలన నుంచి విముక్తి కల్పించేందుకు వచ్చిన నవ‘రత్నం’ను చూసి కోనసీమ పల్లెలు కదులుతున్నాయి. ఇప్పటివరకూ వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన నియోజకవర్గ పేర్లతో బన్నా బత్తుని కిషోర్ అనే యువకుడు జననేత బొమ్మ గీసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. జననేతతో రూపుదిద్దుకున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌కు సోదరుడే కిషోర్. -
టీడీపీవి మోసపూరిత హామీలు
వైఎస్సార్సీపీ తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ తెనాలిరూరల్: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టిందని, రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా పోరాటం చేస్తుందని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి ధైర్యం కల్పించేందుకు ప్రతిపక్ష నేత, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ కౌన్సిలర్లు తాడిబోయిన రమేష్, తాడిబోయిన రామయ్య, బచ్చనబోయిన శ్రీనివాసరావు, కుక్కల ముక్తేశ్వరరావు, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, కార్యదర్శి పెరికల కాంతారావు, జిల్లా అధికార ప్రతినిధి తిరుమలశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తట్టుకూళ్ల అశోక్‌యాదవ్, గుంటుముక్కల వెంకటనాగార్జున, షేక్ బాల(టెక్స్), దేవరపల్లి కిషోర్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యుడు సంపతి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.