మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టిందని, రాష్ట్రంలో ఏ వర్గానికి...
వైఎస్సార్‌సీపీ తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్
తెనాలిరూరల్: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టిందని, రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా పోరాటం చేస్తుందని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని ఏఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి ధైర్యం కల్పించేందుకు ప్రతిపక్ష నేత, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారని తెలిపారు.
సమావేశంలో పార్టీ కౌన్సిలర్లు తాడిబోయిన రమేష్, తాడిబోయిన రామయ్య, బచ్చనబోయిన శ్రీనివాసరావు, కుక్కల ముక్తేశ్వరరావు, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, కార్యదర్శి పెరికల కాంతారావు, జిల్లా అధికార ప్రతినిధి తిరుమలశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తట్టుకూళ్ల అశోక్‌యాదవ్, గుంటుముక్కల వెంకటనాగార్జున, షేక్ బాల(టెక్స్), దేవరపల్లి కిషోర్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యుడు సంపతి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.