Fraudulent guarantees
-
నిధుల్లో ఉత్తర– దక్షిణ తేడా లేదు
మైసూరు: కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులో తాము ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలను వేర్వేరుగా చూడటం లేదనీ, కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందనడం అవివేకమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ‘కర్ణాటకలో సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకథలు చెప్పి, బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీని సమాధి చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని అన్నారు. కర్ణాటకలో వచ్చే నెలలో జరగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా షా మైసూరులో శుక్ర, శనివారాల్లో పర్యటించారు. కాంగ్రెస్ అధిష్టానానికి కావాల్సినంత డబ్బిచ్చే ఏటీఎంలా కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తోందనీ, అవినీతి సర్కారును గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సర్కారు రైతుల రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయీ విడుదల చేయలేదనీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తుండగా కర్ణాటకలో ఎందుకు సాధ్యం కావట్లేదని షా ప్రశ్నించారు. ఒంటరిగానే కర్ణాటకలో పోరాటం కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్‌తో పాటు ఏ ఇతర పార్టీతోనూ మైత్రికి సిద్ధంగా లేమని స్పష్టంచేశారు. దేశంలో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోందని, కర్ణాటకలోనూ గెలిచి దక్షిణాదిలో బీజేపీ సత్తా చాటుతుందన్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే లింగాయత్ ఓట్ల కోసం వారికి ప్రత్యేక మతం హోదాను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిందని అమిత్ షా విమర్శించారు. మాజీ మంత్రి గాలిజనార్ధనరెడ్డికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అమిత్ షా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
టీడీపీవి మోసపూరిత హామీలు
వైఎస్సార్సీపీ తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ తెనాలిరూరల్: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టిందని, రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా పోరాటం చేస్తుందని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి ధైర్యం కల్పించేందుకు ప్రతిపక్ష నేత, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ కౌన్సిలర్లు తాడిబోయిన రమేష్, తాడిబోయిన రామయ్య, బచ్చనబోయిన శ్రీనివాసరావు, కుక్కల ముక్తేశ్వరరావు, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, కార్యదర్శి పెరికల కాంతారావు, జిల్లా అధికార ప్రతినిధి తిరుమలశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తట్టుకూళ్ల అశోక్‌యాదవ్, గుంటుముక్కల వెంకటనాగార్జున, షేక్ బాల(టెక్స్), దేవరపల్లి కిషోర్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యుడు సంపతి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.