సాక్షి, హైదరాబాద్ : ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర నేటికి 196వ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ చేస్తున్న యాత్ర ఇటీవలే చింతపల్లి క్రాస్ వద్ద 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. నాలుగేళ్ల టీడీపీ ప్రజాకంటక పాలన నుంచి విముక్తి కల్పించేందుకు వచ్చిన నవ‘రత్నం’ను చూసి కోనసీమ పల్లెలు కదులుతున్నాయి.
ఇప్పటివరకూ వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన నియోజకవర్గ పేర్లతో బన్నా బత్తుని కిషోర్ అనే యువకుడు జననేత బొమ్మ గీసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. జననేతతో రూపుదిద్దుకున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌కు సోదరుడే కిషోర్.
Comments
Please login to add a commentAdd a comment