
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు రవాణా సేవలను అందిస్తున్న మేధా సర్వో డ్రైవ్స్ సంస్థలో రూ.3లక్షల వార్షిక ప్యాకేజీతో వంద మందిని ఇంజనీరింగ్ ట్రైనీలుగా తీసుకునేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌లలో 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వూ్యలకు హాజరుకావొచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు డిప్లమో విద్యార్థులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే గత డిసెంబరులో రూ.3 లక్షల ప్యాకేజీతో మేధా సర్వో డ్రైవ్స్ 31 మందికి పారిశ్రామిక శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించిందని నాగరాణి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment