ఉచిత జాబ్‌ మేళా విజయవంతం | Southzone DCP inaugurates Job mela for unemployeed youth | Sakshi
Sakshi News home page

ఉచిత జాబ్‌ మేళా విజయవంతం

Published Sat, May 13 2017 10:06 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

Southzone DCP inaugurates Job mela for unemployeed youth

టెరాబైట్ ఐటీ సొల్యూష‌న్స్ ప్రైవేటు లిమిటెడ్, tradehide‌.comల ఆధ్వర్యంలో శనివారం కొత్తపేటలో ఆ సంస్ధ కార్యాలయంలో ఉచిత జాబ్‌ మేళా జరిగింది. ఈ మేళాకు అధిక సంఖ్య‌లో నిరుద్యోగులు హాజ‌ర‌య్యారు. రిజిస్ట్రేష‌న్లు అధిక సంఖ్య‌లో న‌మోద‌య్యాయ‌ని సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నితిషా మాధ‌వ‌రం తెలిపారు. జాబ్‌ మేళాను శ‌నివారం రాచ‌కొండ డీసీపీ వెంక‌టేశ్వ‌ర‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇలాంటి మేళాల వ‌ల‌న నిరుద్యోగుల‌కు చాలా మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఇలాంటి సంస్థల వ‌ల‌న నిరుద్యోగం అనే మాట లేకుండా చేయ‌వ‌చ్చ‌న్నారు.

కొంద‌రు జాబ్‌ల పేరుతో మోసాలకు పాల్ప‌డుతుంటార‌ని ఈ సంస్థ అలా కాకుండా నిరుద్యోగుల‌కు చేయూత‌నిచ్చేందుకు న‌డుంబిగించ‌డం శుభ‌ పరిణామ‌న్నారు. జాబ్‌మేళా పేరుతో మోసాల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన‌చర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. సంస్థ ఎండీ మాట్లాడుతూ.. ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్‌లో  సంస్థ‌ను ప్రారంభించామ‌ని విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇప్పించి వారికి ఉద్యోగం ఇప్పించాల‌న్నదే వారి లక్ష్యమని చెప్పారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ డెవ‌లెపర్‌గా 10 సంవ‌త్స‌రాలు ప‌ని చేసినట్లు చెప్పారు.

మ‌న‌ దేశానికి ఏదైనా చేయాల‌న్నఉద్దేశ్యంతో హైద‌రాబాద్‌లో ఈ సంస్థ‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. మొద‌ట‌గా ఉచితంగా ఈ మేళాను నిర్వ‌హించామని చెప్పారు. సంస్థ ఆధ్వ‌ర్య‌ంలో పీజీడీసీఏ, జావా, మైక్రోసాఫ్ట్ నెట్, ట్యాలీ త‌దిత‌ర కోర్సుల్లో శిక్ష‌ణ ఇప్పిస్తామని వివరించారు. మెరిట్ ఆధారంగా విద్యార్థుల‌కు ఫీజు లేకుండా ఉచితంగా శిక్ష‌ణ ఇప్పించి ఉద్యోగం ఇప్పిస్తామ‌ని వెల్లడించారు. బ్యాంక్‌కు సంబంధించిన ఎగ్జామ్స్‌పై కూడా శిక్ష‌ణ ఇప్పిస్తామ‌ని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement