venkateswarrao
-
ఉచిత జాబ్ మేళా విజయవంతం
టెరాబైట్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, tradehide.comల ఆధ్వర్యంలో శనివారం కొత్తపేటలో ఆ సంస్ధ కార్యాలయంలో ఉచిత జాబ్ మేళా జరిగింది. ఈ మేళాకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్లు అధిక సంఖ్యలో నమోదయ్యాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నితిషా మాధవరం తెలిపారు. జాబ్ మేళాను శనివారం రాచకొండ డీసీపీ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇలాంటి మేళాల వలన నిరుద్యోగులకు చాలా మేలు జరుగుతుందన్నారు. ఇలాంటి సంస్థల వలన నిరుద్యోగం అనే మాట లేకుండా చేయవచ్చన్నారు. కొందరు జాబ్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతుంటారని ఈ సంస్థ అలా కాకుండా నిరుద్యోగులకు చేయూతనిచ్చేందుకు నడుంబిగించడం శుభ పరిణామన్నారు. జాబ్‌మేళా పేరుతో మోసాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సంస్థ ఎండీ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో సంస్థను ప్రారంభించామని విద్యార్థులకు శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగం ఇప్పించాలన్నదే వారి లక్ష్యమని చెప్పారు. అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలెపర్గా 10 సంవత్సరాలు పని చేసినట్లు చెప్పారు. మన దేశానికి ఏదైనా చేయాలన్నఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో ఈ సంస్థను ప్రారంభించినట్లు వెల్లడించారు. మొదటగా ఉచితంగా ఈ మేళాను నిర్వహించామని చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలో పీజీడీసీఏ, జావా, మైక్రోసాఫ్ట్ నెట్, ట్యాలీ తదితర కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ఫీజు లేకుండా ఉచితంగా శిక్షణ ఇప్పించి ఉద్యోగం ఇప్పిస్తామని వెల్లడించారు. బ్యాంక్‌కు సంబంధించిన ఎగ్జామ్స్‌పై కూడా శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. -
భీమవరంలో రౌడీషీటర్ దారుణహత్య
-
‘సీఏ విద్య ఇక సులభతరం!’
మలక్‌పేట (హైదరాబాద్): సీఏ విద్య సులభతరం కానున్నదని, కోర్సు సిలబస్, కాలపరిమితి మారనుందని దిల్సుఖ్నగర్ మాస్టర్‌మైండ్ ఇన్స్టిట్యూట్ ఇన్చార్జి ఎస్. వెంకటేశ్వర్రావు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఏ కోర్సులో రెండవ స్టేజీ ఐపీసీసీలో 9 నెలలు ఉన్న కాలపరిమితిని 18 నెలలకు పెంచడంతో విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్ ని నూతన సిలబస్‌లో పూర్తిగా తొలగించనట్లు చెప్పారు. అదే విధంగా కొత్త సిలబస్‌లో ఇంటర్ నేషనల్ టాక్సేషన్ పొందుపరడచంతో విద్యార్థులకు విదేశీ అవకాశాలు అందిపుచ్చుకునే వీలు ఉంటుందని వివరించారు. చాలా మంది విద్యార్థులు సీఏ విద్య కష్టతరమనే అపోహలో ఉన్నారని, అయితే అందులో వాస్తవం లేదన్నారు. దేశంలో ఇప్పటికి సీఏ ఉత్తీర్ణులైనవారు 25 లక్షల మంది ఉన్నారని తెలిపారు. -
బ్యాడ్మింటన్ చాంపియన్ సరూర్‌నగర్
వరంగల్‌స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణస్థాయి ఇంటర్ క్లబ్ బ్యాడ్మింటన్ పోటీల్లో హైదరాబాద్ సరూర్‌నగర్ క్లబ్ జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఆతిథ్య వరంగల్ జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఎస్ఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో హన్మకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో రెండు రోజుల పాటు జరిగిన ఉత్తర తెలంగాణ స్థాయి ఆఫీసర్స్ ఇంటర్ క్లబ్ బ్యా డ్మింటన్ పోటీల్లో ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో నాలుగు జిల్లాల నుంచి 48 జట్లు పా ల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీల్లో కృష్ణమోహన్, అలీమ్ జోడి (సరూర్‌నగర్ క్లబ్ జట్టు) 21-19, 21-15 తేడాతో సతీష్, దిలీప్ జంట(వరంగల్ క్లబ్)పై విజయం సాధిం చింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సరూర్‌నగర్ జట్టు 21-13, 22-24, 21-14 తేడాతో ఖమ్మంపై, వరంగల్ క్లబ్ 21-13, 21-12 తేడాతో కరీంనగర్ క్లబ్‌పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగగా సరూర్‌నగర్ జోడి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. జనాభాలో ముందున్నా క్రీడల్లో వెనుకపడ్డాం : అర్బన్ ఎస్పీ ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో పోటీ పడుతున్నప్పటీకీ క్రీడల్లో ఎంతో వెనుకపడ్డామని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. ఉత్తర తెలంగాణ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మన ప్రభుత్వాలు క్రీడలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఒలిం పిక్స్‌లో ఎంతో వెనకపడ్డామన్నారు. ప్రభుత్వా ల ప్రోత్సాహం కోసం ఎదురు చూడకుండా పి ల్లల తల్లిదండ్రులు చదువుపాటు క్రీడల్లో ముం దుండేలా చూడాలని కోరారు. అనంతరం ఎస్ఆర్ విద్యాసంస్థల డెరైక్టర్ ఎనగందుల సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నాలుగు జిల్లాల బ్యాడ్మింట న్ పోటీలను నిర్వహించామన్నారు. ఓఎస్డీ కిషోర్, డీఎస్పీ శోభన్‌కుమార్, వరంగల్ క్లబ్ సెక్రటరీ ప్రేమ్‌కుమార్‌రెడ్డి, జాయింట్ సెక్రట రీ భూపాల్‌రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రమేష్‌రెడ్డి, క్లబ్ సభ్యులు వీటీ ప్రసాద్, సురేష్, పూర్ణ, నాగకిషన్, వెంకట్, సీ ఐలు వెంకట్రావ్, జితేందర్‌రెడ్డి,శ్యాంకుమార్, కొమ్ము రాజేందర్ యాదవ్, హన్మంతారావు, కిషోర్, శ్యాంప్రసాద్, శ్రీధర్ పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్ ముసుగులో చోరీలు
వరంగల్ క్రై ం, న్యూస్‌లైన్ : వరంగల్ నగరంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆటోడ్రైవర్ ఎండీ అజ్మత్ అలీఖాన్‌ను సీసీఎస్ పోలీ సులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి నుంచి *13 లక్షల విలువ చేసే నగలు స్వాధీ నం చేసుకున్నారు. హన్మకొండ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు నిందితుడి వివరాలు వెల్లడించారు. హన్మకొం డకు చెందిన అజ్మత్అలీఖాన్ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఒక పెట్రోల్ పంపులో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. పని చేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ చోరీకి పాల్పడ్డారు. 2004లో అతడిని పోలీసు లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యూక హన్మకొండ వేయి స్తంభాల దేవాలయం ప్రాంతానికి చెందిన యువతిని 2007లో వివాహం చేసుకున్నాడు. అనంతరం హన్మకొండలోనే స్థిరపడి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడు చెడు వ్యసనాలకు బానిసై వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో మరోమారు దొంగతనాలకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. తన ఆటోలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో తాళాలు వేసి ఇళ్లను గుర్తించి అదనుచూసి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడేవాడు. ఈ పద్ధతిలో అతడు వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో 7 దొంగతనాలు చేశాడు. క్రైం డీఎస్పీ ప్రకాశ్‌రావుకు అందిన పక్కా సమాచారంతో అర్బన్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేశ్‌కుమార్ తన సిబ్బంది తో కలిసి నిందితుడి ఇంటి వద్ద నిఘా వేశారు. ఈ క్రమంలో అతడు తన వద్ద ఉన్న చోరీ సొత్తును విక్రరుుంచేందుకు వేయిస్తంభాల గుడి వద్ద ఆటోలో బయల్దేరాడు. అదే సమయంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బంగారు ఆభరణా లు కనిపించడంతో విచారణ చేపట్టారు. దీంతో తాను నగరంలో చేసిన దొంగతనాల వివరాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా నిందితుడు అజ్మద్అలీఖాన్ నుంచి *13 లక్షల విలువచేసే 392 గ్రాముల బంగారు ఆభరణాలు, 600 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ఆటో, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ పరిధిలోని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి, ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ క నపరిచిన క్రైం డీఎస్పీ ప్రకాశ్‌రావు, అర్బన్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేశ్‌కుమార్, సుబేదారి సీఐ మధుసూదన్, సుబేదారి క్రైం ఎస్సై డీవీఎస్.రావు, ఏఎస్సై సంజీవరావు, క్రైం హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మహ్మద్ అలీ, శ్రీనివాస్, సల్మాన్‌పాషా, జంపయ్య, చంద్రశేఖర్, హోంగార్డు రవిని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు అభినందించి రివార్డులను అందజేశారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వర్రావు, హన్మకొండ, సీసీఎస్ డీఎస్పీలు దక్షిణామూర్తి, ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.