వరంగల్ క్రై ం, న్యూస్‌లైన్ : వరంగల్ నగరంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆటోడ్రైవర్ ఎండీ అజ్మత్ అలీఖాన్‌ను సీసీఎస్ పోలీ సులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి నుంచి *13 లక్షల విలువ చేసే నగలు స్వాధీ నం చేసుకున్నారు. హన్మకొండ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు నిందితుడి వివరాలు వెల్లడించారు. హన్మకొం డకు చెందిన అజ్మత్‌అలీఖాన్ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఒక పెట్రోల్ పంపులో పనిచేస్తూ జీవనం సాగించేవాడు.
పని చేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ చోరీకి పాల్పడ్డారు. 2004లో అతడిని పోలీసు లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యూక హన్మకొండ వేయి స్తంభాల దేవాలయం ప్రాంతానికి చెందిన యువతిని 2007లో వివాహం చేసుకున్నాడు. అనంతరం హన్మకొండలోనే స్థిరపడి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడు చెడు వ్యసనాలకు బానిసై వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో మరోమారు దొంగతనాలకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. తన ఆటోలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో తాళాలు వేసి ఇళ్లను గుర్తించి అదనుచూసి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడేవాడు. ఈ పద్ధతిలో అతడు వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో 7 దొంగతనాలు చేశాడు. క్రైం డీఎస్పీ ప్రకాశ్‌రావుకు అందిన పక్కా సమాచారంతో అర్బన్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రమేశ్‌కుమార్ తన సిబ్బంది తో కలిసి నిందితుడి ఇంటి వద్ద నిఘా వేశారు. ఈ క్రమంలో అతడు తన వద్ద ఉన్న చోరీ సొత్తును విక్రరుుంచేందుకు వేయిస్తంభాల గుడి వద్ద ఆటోలో బయల్దేరాడు.
అదే సమయంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బంగారు ఆభరణా లు కనిపించడంతో విచారణ చేపట్టారు. దీంతో తాను నగరంలో చేసిన దొంగతనాల వివరాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా నిందితుడు అజ్మద్‌అలీఖాన్ నుంచి *13 లక్షల విలువచేసే 392 గ్రాముల బంగారు ఆభరణాలు, 600 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ఆటో, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ పరిధిలోని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి, ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ క నపరిచిన క్రైం డీఎస్పీ ప్రకాశ్‌రావు, అర్బన్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రమేశ్‌కుమార్, సుబేదారి సీఐ మధుసూదన్, సుబేదారి క్రైం ఎస్సై డీవీఎస్.రావు, ఏఎస్సై సంజీవరావు, క్రైం హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మహ్మద్ అలీ, శ్రీనివాస్, సల్మాన్‌పాషా, జంపయ్య, చంద్రశేఖర్, హోంగార్డు రవిని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు అభినందించి రివార్డులను అందజేశారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, హన్మకొండ, సీసీఎస్ డీఎస్పీలు దక్షిణామూర్తి, ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.