వరంగల్‌స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణస్థాయి ఇంటర్ క్లబ్ బ్యాడ్మింటన్ పోటీల్లో హైదరాబాద్ సరూర్‌నగర్ క్లబ్ జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఆతిథ్య వరంగల్ జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఎస్‌ఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో హన్మకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఉత్తర తెలంగాణ స్థాయి ఆఫీసర్స్ ఇంటర్ క్లబ్ బ్యా డ్మింటన్ పోటీల్లో ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో నాలుగు జిల్లాల నుంచి 48 జట్లు పా ల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీల్లో కృష్ణమోహన్, అలీమ్ జోడి (సరూర్‌నగర్ క్లబ్ జట్టు) 21-19, 21-15 తేడాతో సతీష్, దిలీప్ జంట(వరంగల్ క్లబ్)పై విజయం సాధిం చింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సరూర్‌నగర్ జట్టు 21-13, 22-24, 21-14 తేడాతో ఖమ్మంపై, వరంగల్ క్లబ్ 21-13, 21-12 తేడాతో కరీంనగర్ క్లబ్‌పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగగా సరూర్‌నగర్ జోడి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది.
జనాభాలో ముందున్నా క్రీడల్లో వెనుకపడ్డాం : అర్బన్ ఎస్పీ
ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో పోటీ పడుతున్నప్పటీకీ క్రీడల్లో ఎంతో వెనుకపడ్డామని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. ఉత్తర తెలంగాణ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మన ప్రభుత్వాలు క్రీడలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఒలిం పిక్స్‌లో ఎంతో వెనకపడ్డామన్నారు. ప్రభుత్వా ల ప్రోత్సాహం కోసం ఎదురు చూడకుండా పి ల్లల తల్లిదండ్రులు చదువుపాటు క్రీడల్లో ముం దుండేలా చూడాలని కోరారు.
అనంతరం ఎస్‌ఆర్ విద్యాసంస్థల డెరైక్టర్ ఎనగందుల సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నాలుగు జిల్లాల బ్యాడ్మింట న్ పోటీలను నిర్వహించామన్నారు. ఓఎస్‌డీ కిషోర్, డీఎస్పీ శోభన్‌కుమార్, వరంగల్ క్లబ్ సెక్రటరీ ప్రేమ్‌కుమార్‌రెడ్డి, జాయింట్ సెక్రట రీ భూపాల్‌రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రమేష్‌రెడ్డి, క్లబ్ సభ్యులు వీటీ ప్రసాద్, సురేష్, పూర్ణ, నాగకిషన్, వెంకట్, సీ ఐలు వెంకట్రావ్, జితేందర్‌రెడ్డి,శ్యాంకుమార్, కొమ్ము రాజేందర్ యాదవ్, హన్మంతారావు, కిషోర్, శ్యాంప్రసాద్, శ్రీధర్ పాల్గొన్నారు.
బ్యాడ్మింటన్ చాంపియన్ సరూర్‌నగర్
Published Mon, Dec 23 2013 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement