రాకెట్ రాకింగ్స్
-
బాడ్మింటన్‌లో సత్తా చాటుతున్న విద్యార్థులు
-
మేటి క్రీడాకారుల స్ఫూర్తితో ముందుకు
-
ప్రత్యేక శిక్షణతో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణింపు
క్రీడలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతిగాంచిన ఓరుగల్లు జిల్లా నుంచి ఎంతో మంది యువ క్రీడాకారులు వెలుగొందుతున్నారు. తాము ఎంచుకున్న క్రీడలో నిత్యం శిక్షణ పొందుతూ కాకతీయుల రాజధాని పేరును దేశ వ్యాప్తంగా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన ఆటగా పేరొందిన బాడ్మింటన్ క్రీడలో తమదైన ప్రతిభ కనబరుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు పలువురు యువకులు, విద్యార్థులు. – వరంగల్ అర్బన్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా విలసిల్లుతున్న వరంగల్ జిల్లా నుంచి ఎంతో మంది క్రీడాకారులు వివిధ ఆటల్లో రాణిస్తున్నారు. ఆర్చరీలో గతంలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి వర్ధినేని ప్రణీతను స్ఫూర్తిగా తీసుకుని పలువురు విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడలో అంతర్జాతీయస్థాయిలో రాణించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు సంప్రదాయ ఆటగా పేరొందిన బాడ్మింటన్‌లో విద్యార్థులు హన్మకొండలోని జవహర్‌లాల్‌నెహ్రూ, వరంగల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియాలతోపాటు హన్మకొండ ఆఫీసర్స్ క్లబ్, వరంగల్ ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌లో కోచ్ లు శ్రీధర్, రమేష్, సందీప్, నీల్ కమల్, శ్యాంప్రసాద్ పర్యవేక్షణ లో శిక్షణ పొందుతున్నారు. కాగా, ఆసక్తి కలిగిన విద్యార్థులు, యువకులకు బాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, కార్యదర్శి పింగిళి రమేష్‌రెడ్డి, బాధ్యులు నాగకిషన్ ప్రోత్సాహం అందిస్తున్నారు.
బాడ్మింటన్ నేపథ్యం
బాల్ బాడ్మింటన్ తరహాలోనే ఉండే షటిల్ బాడ్మింటన్ కూడా సంప్రదాయపు క్రీడ. ఇది 18వ శతాబ్దం నాటి బ్రిటీష్ ఇండియా ఆటగా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. 1860లో లండన్‌లో బాడ్మింటన్ క్రీడా సామగ్రి తయారయ్యాయని పేర్కొంటోంది. క్రమేపి విస్తరించిన బాడ్మింటన్ 1934లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్‌గా ఏర్పడింది. ఇంగ్లండ్‌లో ప్రమాణాలు ఏర్పడినప్పటికి, యూరోప్‌లోని పోటీతత్వ పురుషులు బాడ్మింటన్‌లో రాణించేవారు. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచస్థాయి క్రీడాకారులను అందిస్తూ అంతర్జాతీయస్థాయి పోటీల్లో ఆధిపత్యం వహిస్తున్న దేశాల్లో ఇండోనేషియా, కొరియా, చైనా, మలేషియాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో చైనా, భారతదేశం కూడా బాడ్మింటన్‌లో బలమైన శక్తులుగా ఎదిగాయి. కాగా, జిల్లాకు చెందిన పలువురు యువ క్రీడాకారులు కూడా రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణిస్తూ పేరు సంపాదిస్తున్నారు. ఈ సందర్భంగా వారి ట్రాక్ రికార్డును తెలుసుకుందాం.
రాణిస్తున్న రమిజా
నగరానికి చెందిన యువ క్రీడాకారిణి రమిజా ఫైజాన్‌మహబూబీ బాడ్మింట¯Œæలో జాతీయస్థాయిలో రాణిస్తూ పతకాలు సాధిస్తోంది. హన్మకొండలోని ఎస్‌ఆర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రమిజాఫైజాన్ పాఠశాల స్థాయి నుంచే బాడ్మింట¯Œæలో ప్రతిభ కనబరుస్తోంది. ఈ మేరకు ఇప్పటివరకు స్కూల్‌గేమ్స్‌లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. గతంలో జైపూర్‌లో జరిగిన ఆల్ ఇండియా జూనియర్ నేషనల్స్‌లో, జమ్ముకశ్మీర్‌లోని ఆర్‌జీకేఏ పైకా నేషనల్స్‌కు హాజరై బహుమతులు సాధించింది. అలాగే కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన ఆల్ ఇండియా జూనియర్ స్టేట్‌మీట్‌లో డబుల్స్‌లో రన్నర్‌గా, సింగిల్స్‌లో మూడో స్థానం లో నిలిచింది. 2014లో ఎస్‌జీఎఫ్‌ఐ స్టేట్‌మీట్‌లో ప్రథమస్థానం, రాథాక్‌లో జరిగిన ఆల్ ఇండియా సబ్‌జూనియర్ నేషనల్స్‌లో, ఆర్‌జీకేఏ పైకా ఉమెన్ నేషనల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. 2013లో ఆర్‌జీకేఏ పైకా స్టేట్‌మీట్‌లో తృతీయ బహుమతి, మధ్యప్రదేశ్‌లోని ఆర్‌జీకేఏ పైకా ఉమెన్స్ నేషనల్ దోన్ మోడల్ టీం ఈవెంట్ పొందింది. అలాగే గుంతకల్లులో అండర్ –15 స్టేట్స్ రన్నర్ డబుల్స్‌లో, అనంతరంలోని అండర్ –13 స్టేట్ పోటీల్లో రన్నర్‌గా డబుల్స్‌లో, సింగిల్స్ థర్డ్ ప్లేస్ సాధించింది. ఆల్ ఇండియా స»Œ జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ దుర్గాపూర్ థర్డ్ ప్లేస్, సింగిల్స్, డబుల్స్ క్వార్టర్ కైవసం చేసుకుంది. అండర్–19 స్టేట్ వరంగల్ డబుల్స్‌లో థర్డ్ ప్లేస్ పొందింది.
‘పూజా’ పరిమళం
హన్మకొండలోని అరోరా డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పూజా అటు చదువులో.. ఇటు బాడ్మింటన్‌లో పరిమళిస్తోంది. వరంగల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో ప్రత్యేక శిక్షణ పొందుతూ బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతోంది. కాగా, పూజా 2016లో జమ్ముకాశ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్ 17–19 విభాగాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో ఔరంగాబా ద్, కేరళ, 2015లో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలకు హాజరైంది. 2016లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయిలో పోటీల్లో మూడో స్థానం సాధించింది. 2015లో హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైంది.