విజయనగర్‌కాలనీ: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు కృషిచేస్తున్నామని ఉపాధి శిక్షణశాఖ అదనపు సంచాలకులు, తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) అధికారి పి.ధర్మరాజు తెలిపారు. నగరంలోని 38 సంస్థల అభ్యర్ధన మేరకు 3159 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 27న మెహిదీపట్నంలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఉపాధి శిక్షణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ ఫెయిర్ మెహిదీపట్నం పుల్లారెడ్డి కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. బుధవారం విజయనగర్‌కాలనీలోని టామ్‌కామ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జాబ్‌ఫెయిర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
జాబ్‌ఫెయిర్‌లో ప్రముఖ కంపెనీలు
నిస్సాన్ కంపెనీ-చెన్నై, వరుణ్ మోటార్స్, వసంత టూల్స్ ఆండ్ క్రాఫ్ట్స్, హర్ష టయోటా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇన్‌బిస్కో, ెహ టిరోల్యాబ్స్, వెరిబ్యాటిం, సిప్రాల్యాబ్స్, గ్రీన్‌పార్క్ హోటల్, ఏజీస్, ఈమౌకా, ఎంఎస్‌ఎన్ ల్యాబ్ తదితర కంపెనీలు పాల్గొంటాయి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి రీజియన్ ఆర్‌ఈవో టామ్‌కామ్ జనరల్ మేనేజర్ కె.భవానీ, రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం అధికారి ఆర్.జగన్నాథం, ఉపాధి అధికారులు ఎ.పరమేశ్వర్ రెడ్డి, ఎస్. సుబ్బారామయ్య తదితరులు పాల్గొన్నారు.
27న మెగా జాబ్ ఫెయిర్
Published Thu, Sep 25 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement