ఒకేషనల్‌ విద్యార్థులకు ఉద్యోగ మేళ | Job Fair For Intermediate Vocational Students in Nampally | Sakshi
Sakshi News home page

ఒకేషనల్‌ విద్యార్థులకు ఉద్యోగ మేళ

Published Tue, Dec 24 2019 2:15 PM | Last Updated on Wed, Dec 25 2019 3:03 PM

Job Fair For Intermediate Vocational Students in Nampally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ వృత్తివిద్య అభ్యసించిన విద్యార్థుల కోసం ఈనెల 30న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ఒకేషనల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ అయాజ్‌ అలీఖాన్‌ తెలిపారు. ఆటో మొబైల్‌( ఏఈటీ), మెకానికల్‌ టెక్నాలజీ(ఎంటీ) పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాంపల్లి బాజహర్‌ఘాట్‌లో ఉన్న ప్రభుత్వ వృత్తి కళాశాలలో ఈ ఉద్యోగ మేళ జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పాస్‌, ఫెయిల్‌ అయిన ఇతర గ్రూపుల విద్యార్థులు కూడా ఉద్యోగ మేళాకు హాజరుకావొచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 9395554558 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement