మేడికొండూరు, న్యూస్‌లైన్: మండలం లోని డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలోని యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో లాజిక్ ఇ ఆర్ పి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొహాలీ, పంజాబ్ వారి ఆధ్వర్యంలో రెండు రోజులుగా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
బీటెక్ ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ విద్యార్థులు 150 మంది హాజరయ్యారు. కంపెనీ ఆపరేషన్స్ హెడ్ సాల్మన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి 10 మందిని ఎంపిక చేశారు. చీరాలలోని వీఆర్‌ఎస్, వైఆర్‌ఎన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన జాబ్‌ఫెయిర్ నందు యురేకాఫోర్ట్, ఎన్‌ఎస్‌ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీలకు కళాశాలకు చెందిన 16 మంది ఎంబీఏ విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు.
ఆదివారం జాస్మిన్ ఇన్‌ఫోటెక్ చెన్నై సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో అర్హత సాధించిన 33మంది విద్యార్థులకు రాతపరీక్ష నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ గాలి బాలి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే కార్యదీక్ష, పట్టుదలతో పాటు ఇంగ్లిష్ భాషపై ప్రావీణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు.
కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఫాదర్ లూర్దురెడ్డి మాట్లాడుతూ వివిధ కంపెనీల ప్రోత్సాహంతో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో టెక్‌మహీంద్రా, విప్రో కంపెనీలతో పాటు వివిధ కంపెనీలు ఎంపికలు నిర్వహించడానికి కళాశాలకు రానున్నాయని చెప్పారు.
యూనివర్సల్ విద్యార్థుల ఎంపిక
Published Tue, Mar 25 2014 3:12 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement
Advertisement