చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏవరినోటా విన్నా.. నీరజ్ చోప్రానే వినిపిస్తున్నాడు. నీరజ్ చోప్రా నామస్మరణతో దేశం ఊగిపోతుంది. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా నీరజ్ దూసుకుపోతున్నాడు. ఒక్కరోజులోనే అతని సోషల్‌మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు.
నీరజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సుమారు 2.8 మిలియన్ల వరకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. కాగా ఇప్పుడు పలు మల్టీనేషనల్ కంపెనీలు నీరజ్ చోప్రా వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నీరజ్ చోప్రా తమ కంపెనీల బ్రాండ్‌లకు ప్రచారకర్తగా నియమించుకోవాలని కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అడ్వర్‌టైజింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం నీరజ్ చోప్రా ప్రస్తుత ఎండోర్స్‌మెంట్ ఫీజు సుమారు రు. 1.75 కోట్లు, టోక్యో ఒలింపిక్స్‌లోని చారిత్రాత్మక విజయంతో కనీసం 50% పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొనారు.
నీరజ్ చోప్రా ఎండార్స్‌మెంట్ ఫీజు సుమారు రూ. 2.5 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. నీరజ్ చోప్రా అంతకుముందు పలు కంపెనీలకు బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేశాడు. నీరజ్ గత నాలుగు సంవత్సరాలుగా గాటోరేడ్ ఎనర్జీ డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు. అంతేకాకుండా నీరజ్ కంట్రీ డిలైట్ నేచురల్స్, జిల్లెట్ ఇండియా, మొబిల్ ఇండియా, ఆమ్‌స్ట్రాడ్ బ్రాండ్లతో కలిసి పనిచేశారు.
నీరజ్‌పైనే పలు కంపెనీలు గురి...
నీరజ్ చోప్రా జావెలింగ్ త్రోలో బంగారు పతకాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధించాడు. నీరజ్ బ్రాండ్ విలువ కూడా పెరుగుతుందని ప్రముఖ అడ్వరటైజింగ్ సంస్థ బ్రాండ్ గురు అండ్ హరీష్ బిజూర్ కన్సల్ట్స్ ఇంక్ వ్యవస్థాపకుడు హరీష్ బిజూర్ వెల్లడించారు. ప్రముఖ కంపెనీలు నీరజ్‌ను బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాకుండా నీరజ్ చోప్రా అత్యంత ఖరీదైన బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తాడని హరీష్ బిజూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెల్చుకున్న అభినవ్ బింద్రా..ఆ సమయంలో అనేక కంపెనీలు అభినవ్ బింద్రా కోసం క్యూ కట్టాయి. టీఆర్‌ఏ రిసెర్చ్, సీఈవో అండ్ బ్రాండ్ ఎక్సపర్ట్ చంద్రమౌళి మాట్లాడుతూ..నీరజ్ చోప్రా బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ ఫీజు గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా నీరజ్ బ్రాండ్ వాల్యూ డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వేరిబుల్స్, ఈ-కామర్స్, ఆటో, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నీరజ్ చోప్రాను కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటాయని పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment