విస్తారా హోలీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా హోలీ సందర్భంగా తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తోంది. విస్తారా ఎయిర్లైన్స్, టాటా సన్స్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ మధ్య ఉమ్మడి వెంచర్లో హోలీ పండుగ సందర్భంగా రూ.999తో ప్రారంభమయ్యే తగ్గింపు ధరలను అందిస్తోంది. వీటిని విస్తారా మొబైల్ యాప్, లేదా www.airvistara.com ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ను పొందాలంటే కనీసం 21 రోజులు ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అన్ని కలుపుకొని ఒక మార్గంలో అందిస్తున్న ఈ టికెట్లను మార్చి 10 నుండి మార్చి 15 వరకు బుక్ చేసుకోవాలి.అలాగే టికెట్ల ద్వారా మార్చి 30 నుంచి అక్టోబర్ 1, 2017 మధ్య ప్రయాణించవచ్చు. గుర్గావ్-ఆధారిత ఎయిర్లైన్స్ గౌహతి-బాగ్డోగ్రా మార్గం రూ 999 దాని ప్రచార ఛార్జీల అందిస్తోంది
జమ్మూ- శ్రీనగర్ విమాన టికెట్ రూ 1199లుగా, ఢిల్లీ-లక్నో రూ.1,549లు, ఢిల్లీ-చండీగఢ్ టికెట్ రూ 1649 లుగా ఉండనుంది. వీటితోపాటు, ఢిల్లీ- హైదరాబాద్, గోవా,పుణే , అహ్మదాబాద్ తదితర రూట్లలోనూ తగ్గింపు ధరల్లో టికెట్లను అందిస్తున్నట్టు విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలు విస్తారా అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయగలరు.