Rs 999
-
రూ.999లకే నోకియా ఫీచర్ ఫోన్
న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్ అధికారాలు చేజిక్కించుకున్న ‘హెచ్ఎండీ గ్లోబల్’ తాజాగా ‘నోకియా–105’ మోడల్లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.999. ఇందులో 1.8 అంగుళాల కలర్ స్క్రీన్, ఎల్ఈడీ టార్చ్‌లైట్, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఇక డ్యూయెల్ సిమ్ వెర్షన్ ఫోన్ ధర రూ.1,149గా ఉంది. ఈ రెండు ఫోన్లు బుధవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి. -
సమ్మర్ స్పెషల్: 999కే విమాన టిక్కెట్
తక్కువ ధరలు కలిగిన విమానసంస్థగా పేరొందిన ఇండిగో ఇటీవలే 900 విమానాలను ఒకే రోజు ఆపరేట్ చేసి దేశీయ విమానయాన రంగంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో ఉన్న ఇండిగో ప్రయాణికుల కోసం స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. అన్ని ధరలను కలుపుకుని విమాన టిక్కెట్ ను కేవలం 999 రూపాయలకే అందించనున్నట్టు పేర్కొంది. మూడు రోజుల ''సమ్మర్ వొకేషన్ ఆఫర్'' కింద అన్ని నెట్ వర్క్ పరిధిలో దీన్ని వర్తింపజేస్తోంది. 6ఈ నెట్ వర్క్-దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు తక్కువ ధరల్లో ఇండిగో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఈ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 2017 ఏప్రిల్ 10 నుంచి 2017 ఏప్రిల్ 12 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ లైన్ పేర్కొంది. 2017 మే 1 నుంచి జూన్ 30కి మధ్యలో ప్రయాణాలకు ఎంపికచేసిన ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుందట. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ తో ఈ స్పెషల్ ఫేర్స్ అందుబాటులో ఉంటాయని, ఒక్కసారి టిక్కెట్ కు చెల్లించిన ఛార్జీలు మళ్లీ రీఫండ్ చేయమని పేర్కొంది. 44 ప్రాంతాలకు చక్కర్లు కొడుతున్న ఈ సంస్థ మొత్తం 907 డైలీ ఫ్లైట్స్ ను కలిగి ఉంది. -
విస్తారా హోలీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా హోలీ సందర్భంగా తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తోంది. విస్తారా ఎయిర్‌లైన్స్, టాటా సన్స్ మరియు సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఉమ్మడి వెంచర్లో హోలీ పండుగ సందర్భంగా రూ.999తో ప్రారంభమయ్యే తగ్గింపు ధరలను అందిస్తోంది. వీటిని విస్తారా మొబైల్ యాప్, లేదా www.airvistara.com ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ను పొందాలంటే కనీసం 21 రోజులు ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కలుపుకొని ఒక మార్గంలో అందిస్తున్న ఈ టికెట్లను మార్చి 10 నుండి మార్చి 15 వరకు బుక్ చేసుకోవాలి.అలాగే టికెట్ల ద్వారా మార్చి 30 నుంచి అక్టోబర్ 1, 2017 మధ్య ప్రయాణించవచ్చు. గుర్గావ్-ఆధారిత ఎయిర్‌లైన్స్ గౌహతి-బాగ్డోగ్రా మార్గం రూ 999 దాని ప్రచార ఛార్జీల అందిస్తోంది జమ్మూ- శ్రీనగర్ విమాన టికెట్ రూ 1199లుగా, ఢిల్లీ-లక్నో రూ.1,549లు, ఢిల్లీ-చండీగఢ్ టికెట్ రూ 1649 లుగా ఉండనుంది. వీటితోపాటు, ఢిల్లీ- హైదరాబాద్, గోవా,పుణే , అహ్మదాబాద్ తదితర రూట్లలోనూ తగ్గింపు ధరల్లో టికెట్లను అందిస్తున్నట్టు విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలు విస్తారా అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయగలరు. -
రూ. 999కే పవర్ బ్యాంక్
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు చార్జింగ్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో రంగంలోకి వచ్చినవే పవర్ బ్యాంక్ లు. ఈ క్రమంలోనే మొబైల్ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా మొబైల్స్ తయారీదారు గ్జోలో అతిచవకైన పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది. స్మార్ట్ డివైస్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ గ్జోలో ఇప్పటికే అతి చవకైన స్మార్ట్ ఫోన్ ను అందించింది. ఈ తరహాలో సూపర్ పవర్ బ్యాంకు ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 999 రూ.లకే 6000 ఎంఏహెచ్ సామర్ధ్యం తో పనిచేసే సూపర్ అండ్ స్లిమ్ పవర్ బ్యాంకు ఎక్స్060ను రూపొందించింది. గ్రే, బ్లాక్ కలర్స్ లో ఉన్న ఈ పవర్ బ్యాంక్ అమెజాన్ లో మాత్రమే ఇది లభిస్తుంది . దీంట్లో అమర్చిన లిథియం అయాన్ పాలీమీటర్ బ్యాటరీలు బ్యాటరీ లైఫ్ పొడిగించడంతోపాటు, చాలా తొందరగా చార్జ్ అవుతాయని కంపెనీ చెబుతోంది. ఓవర్ కరెంట్ ను నియంత్రించే ఆధునిక టెక్నాలజీ తమ డివైస్ సొంతమంటోంది. ఓవర్ చార్జ్ ప్రొటెక్షన్, వోల్టేజీ, ప్రస్తుత లోడ్ ను గుర్తించే ఫీచర్స్ కూడా ఉన్నాయంటోంది. 5వీ-2ఎ ఇన్పుట్ 5వీ-2ఎ ఇన్పుట్ ఓట్ పుట్ కెపాసిటీ, 140 గ్రా. బరువు , 7.9 మిమీ వెడల్పుతో క్యారీ చేయడానికి వీలుగగా స్మూత్ మెటాలిక్ ఫినిష్, యాంటీ స్లిప్ ఎక్స్ టీరియర్ తో చాలా ఎలిగెంట్ లు క్ లో అలరిస్తోంది. -
బ్యాండ్ బజాయిస్తున్న ఫిట్ రిస్ట్
చేతులకు బ్యాండ్ పెట్టుకోవడం ఈ తరహా కుర్రాళ్లో కొత్తరకం ఫ్యాషన్. అభిరుచులకు తగ్గట్టు మార్కెట్లో ఎలాంటి బ్యాండ్ లు లభిస్తున్నాయో తెలుసుకుని మరీ కొనేస్తుంటారు. వాటిని పెట్టుకుని తెగ సంబరపడిపోతుంటారు ఈ కుర్రకారు. ఈ విధంగా యువతను ఆకట్టుకోవడం కోసం, వారి అభిరుచులకు తగ్గట్టుగా రకరకాల లేటెస్ట్ బ్యాండ్ లను కంపెనీలు రూపొందిస్తున్నాయి. మార్కెట్లో లభించే షియోమీ, ఫిట్ బిట్, జావ్ బోన్, జోకి వంటి వివిధ బ్యాండ్లను అమ్మకాలను బీట్ చేస్తూ ఇంటెక్స్ ఫిట్ రిస్ట్ బ్యాండ్ దూసుకెళ్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ తో యువతను తెగ ఆకట్టుకుంటోంది. కేవలం రూ.999కే మార్కెట్లో లభించే ఈ బ్యాండ్, షియోమీ బ్యాండ్ ల మాదిరిగానే ఉంటోంది. కానీ దీనిలో స్పెషల్ ఫీచర్ గా డిస్ ప్లేను కలిగి ఉండటం యువతకు తెగ నచ్చేసింది. డిస్ ప్లే బ్యాటరీలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఎక్కువ కాలం పనిచేసేలా దీన్ని రూపొందించారు. డిస్ ప్లే కలిగి ఉన్న ఈ బ్యాండ్... నోటిఫికేషన్లు, కాల్స్, మెసేజ్ లను రిసీవ్ చేసుకుంటుంది. రబ్బర్ తో ఈ బ్యాండ్ తయారుచేయడం వల్ల చాలా సున్నితంగా ఉంటూ చేతికి పెట్టుకున్న ఫీలింగే అనిపించింది. ఎన్నిగంటలైనా చేతికి ధరించి ఉంచుకోవచ్చు. ఈ బ్యాండ్ కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మాత్రమే కనెక్ట్ అవుతుంది. దీన్ని కనెక్టు చేయాలంటే కూడా చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కచ్చితమైన ఫలితాలను ఇది అందిస్తుందా? అనడంలో మాత్రం ఇంటెక్స్ కంపెనీ ఎలాంటి హామీ ఇవ్వలేకపోతోంది.