రూ.999లకే నోకియా ఫీచర్ ఫోన్
న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్ అధికారాలు చేజిక్కించుకున్న ‘హెచ్‌ఎండీ గ్లోబల్’ తాజాగా ‘నోకియా–105’ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.999. ఇందులో 1.8 అంగుళాల కలర్ స్క్రీన్, ఎల్‌ఈడీ టార్చ్‌లైట్, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఇక డ్యూయెల్ సిమ్ వెర్షన్ ఫోన్ ధర రూ.1,149గా ఉంది. ఈ రెండు ఫోన్లు బుధవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి.