చేతులకు బ్యాండ్ పెట్టుకోవడం ఈ తరహా కుర్రాళ్లో కొత్తరకం ఫ్యాషన్. అభిరుచులకు తగ్గట్టు మార్కెట్లో ఎలాంటి బ్యాండ్ లు లభిస్తున్నాయో తెలుసుకుని మరీ కొనేస్తుంటారు. వాటిని పెట్టుకుని తెగ సంబరపడిపోతుంటారు ఈ కుర్రకారు. ఈ విధంగా యువతను ఆకట్టుకోవడం కోసం, వారి అభిరుచులకు తగ్గట్టుగా రకరకాల లేటెస్ట్ బ్యాండ్ లను కంపెనీలు రూపొందిస్తున్నాయి.
మార్కెట్లో లభించే షియోమీ, ఫిట్ బిట్, జావ్ బోన్, జోకి వంటి వివిధ బ్యాండ్లను అమ్మకాలను బీట్ చేస్తూ ఇంటెక్స్ ఫిట్ రిస్ట్ బ్యాండ్ దూసుకెళ్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ తో యువతను తెగ ఆకట్టుకుంటోంది. కేవలం రూ.999కే మార్కెట్లో లభించే ఈ బ్యాండ్, షియోమీ బ్యాండ్ ల మాదిరిగానే ఉంటోంది. కానీ దీనిలో స్పెషల్ ఫీచర్ గా డిస్ ప్లేను కలిగి ఉండటం యువతకు తెగ నచ్చేసింది.
డిస్ ప్లే బ్యాటరీలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఎక్కువ కాలం పనిచేసేలా దీన్ని రూపొందించారు. డిస్ ప్లే కలిగి ఉన్న ఈ బ్యాండ్... నోటిఫికేషన్లు, కాల్స్, మెసేజ్ లను రిసీవ్ చేసుకుంటుంది. రబ్బర్ తో ఈ బ్యాండ్ తయారుచేయడం వల్ల చాలా సున్నితంగా ఉంటూ చేతికి పెట్టుకున్న ఫీలింగే అనిపించింది. ఎన్నిగంటలైనా చేతికి ధరించి ఉంచుకోవచ్చు. ఈ బ్యాండ్ కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మాత్రమే కనెక్ట్ అవుతుంది. దీన్ని కనెక్టు చేయాలంటే కూడా చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కచ్చితమైన ఫలితాలను ఇది అందిస్తుందా? అనడంలో మాత్రం ఇంటెక్స్ కంపెనీ ఎలాంటి హామీ ఇవ్వలేకపోతోంది.