షావోమి ఎ1 పై డిస్కౌంట్‌ | Xiaomi Mi A1 gets Rs 2,000 price cut in India: Details here | Sakshi
Sakshi News home page

షావోమి ఎ1 పై డిస్కౌంట్‌

Published Wed, Dec 6 2017 2:32 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Xiaomi Mi A1 gets Rs 2,000 price cut in India: Details here - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనీస్ హ్యాండ్‌సెట్ మేకర్ షావోమీ తన అభిమానులకు మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పింది. భారత్‌లో ఎంఐ ఎ1 స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ డివైజ్‌పై రూ.2వేల రూపాయల మేర తాత్కాలిక డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు పేర్కొంది.

డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌లలో ఈ ప్రత్యేక డిస్కౌంట్‌తో ఎంఐ ఎ1 లభ్యంకానుందని షావోమి ట్విట్టర్‌లో వెల్లడించింది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌ను షావోమి లాంచ్‌ చేసింది. లాంచింగ్‌ సందర్భంగా దీని ధర 14,999 రూపాయలు. అయితే ప్రస్తుత తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.12,999కే లభించనుంది.

ఎంఐ ఎ1 ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే 
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 
2గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌ 
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement