రూ. 999కే పవర్ బ్యాంక్ | XOLO launches super slim Power Bank with 6000mAh capacity at Rs 999 | Sakshi
Sakshi News home page

రూ. 999కే పవర్ బ్యాంక్

Published Thu, May 19 2016 4:48 PM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

రూ. 999కే  పవర్  బ్యాంక్

రూ. 999కే పవర్ బ్యాంక్

న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు  చార్జింగ్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ఈ నేపథ్యంలో  రంగంలోకి వచ్చినవే పవర్ బ్యాంక్ లు.  ఈ క్రమంలోనే   మొబైల్  యూజర్ల అభిరుచులకు అనుగుణంగా  మొబైల్స్ తయారీదారు గ్జోలో  అతిచవకైన  పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది. స్మార్ట్  డివైస్ ఉత్పత్తిలో అగ్రగామి  సంస్థ గ్జోలో ఇప్పటికే అతి చవకైన   స్మార్ట్  ఫోన్ ను  అందించింది. ఈ తరహాలో సూపర్  పవర్ బ్యాంకు ను  మార్కెట్లో  అందుబాటులోకి తీసుకొచ్చింది. 999 రూ.లకే  6000 ఎంఏహెచ్  సామర్ధ్యం తో పనిచేసే  సూపర్ అండ్ స్లిమ్  పవర్ బ్యాంకు ఎక్స్060ను రూపొందించింది.  గ్రే, బ్లాక్  కలర్స్ లో  ఉన్న ఈ పవర్ బ్యాంక్  అమెజాన్ లో  మాత్రమే ఇది లభిస్తుంది .

దీంట్లో అమర్చిన లిథియం అయాన్ పాలీమీటర్ బ్యాటరీలు  బ్యాటరీ లైఫ్ పొడిగించడంతోపాటు,  చాలా  తొందరగా చార్జ్ అవుతాయని కంపెనీ చెబుతోంది.  ఓవర్ కరెంట్ ను  నియంత్రించే ఆధునిక టెక్నాలజీ తమ డివైస్  సొంతమంటోంది.  ఓవర్ చార్జ్ ప్రొటెక్షన్, వోల్టేజీ,   ప్రస్తుత  లోడ్ ను గుర్తించే ఫీచర్స్ కూడా ఉన్నాయంటోంది.  5వీ-2ఎ  ఇన్పుట్ 5వీ-2ఎ  ఇన్పుట్ ఓట్ పుట్ కెపాసిటీ, 140 గ్రా. బరువు , 7.9 మిమీ వెడల్పుతో క్యారీ చేయడానికి వీలుగగా  స్మూత్  మెటాలిక్ ఫినిష్, యాంటీ స్లిప్ ఎక్స్ టీరియర్ తో  చాలా ఎలిగెంట్ లు క్ లో అలరిస్తోంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement