
ముంబై: విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా 3వ వార్షికోత్సవం సందర్భంగా పరిమితకాల టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1,099 ప్రారంభ ధరతో విమాన టికెట్లను (ఎకానమీ క్లాస్) ఆఫర్ చేస్తోంది.
ఇక ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.2,599 నుంచి, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.7,499 నుంచి ప్రారంభమౌతుంది. మంగళవారం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది జనవరి 17 నుంచి ఏప్రిల్ 18 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment