
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తారా మరోసారి పండుగల ఆఫర్‌ను ప్రకటించింది. ‘24–అవర్స్ ఓన్లీ’ పేరుతో అన్ని పన్నులతో కలిపి రూ.999కే విమాన ప్రయాణమని తెలిపింది. ఈ ఆఫర్ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్‌లకు వర్తిస్తుందని తెలిపింది.
అయితే, ప్రారంభ టికెట్ ధర ఆఫర్ పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా నుంచి గువాహటి మార్గానికి మాత్రమే పరిమితమని పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 12:01 సమయానికి బుకింగ్స్ ప్రారంభం కాగా, డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వరకు ప్రయాణాలకు ఆఫర్ వర్తిస్తుంది. ఇతర మార్గాలలో రూ.1,199 నుంచి రూ.2,599 టికెట్ ధరను ఆఫర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment