AMD
-
హెచ్‌పీ సీఈఎస్‌లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు
టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. టెక్ యుగంలో ల్యాప్‌టాప్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో సేవలందిస్తున్న హెచ్‌పీ(HP) కంపెనీ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)-2025లో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇవి కృత్రిమమేధ సాయంతో పని చేస్తాయని కంపెనీ తెలిపింది. దాంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది. 2025వ సంవత్సరానికిగాను సీఈఎస్ లాస్‌వెగాస్‌లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది.హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా జీ1ఐ: ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్‌తో 48 టాప్స్ ఎన్పీయూ టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేసే ఏఐ బిజినెస్ నోట్ బుక్ అని కంపెనీ తెలిపింది.హెచ్‌పీ జెడ్ బుక్ అల్ట్రా జీ 1ఎ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 14 అంగుళాల ల్యాప్‌టాప్ ఇది. ఏంఎడీ ప్రాసెసర్‌తో వచ్చే ఈ డివైజ్‌తో హై-పెర్ఫార్మెన్స్ వర్క్ ఫ్లోలకు ఎంతో సమర్థంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది.హెచ్‌పీ జెడ్2 మినీ జీ1ఏ: ఏఎండీ రైజెన్ ఏఐ మ్యాక్స్ ప్రో ప్రాసెసర్లు, 6-కోర్/12-థ్రెడ్ నుంచి 16-కోర్/32-థ్రెడ్ కాన్ఫిగరేషన్లతో దీన్ని ఆవిష్కరించారు. ఏఎండీ రేడియన్ 8060ఎస్, 8050ఎస్, 8040ఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయం ఉండేలా దీన్ని తయారు చేశారు.ఇదీ చదవండి: మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!హెచ్‌పీ జెడ్ క్యాప్టిస్: మెటీరియల్స్ డిజిటలైజ్ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి దీన్ని రూపొందించారు. ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మెటీరియల్ క్యాప్చర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇది ఎన్వీడియోకు చెందిన జెట్సన్ ఏజీఎక్స్ జేవియర్ మాడ్యూల్, ఫోటోమెట్రిక్ కంప్యూటర్ విజన్ సిస్టమ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.హెచ్‌పీ థండర్ బోల్ట్ 4 అల్ట్రా జీ6 డాక్: ఇది డాకింగ్ స్టేషన్‌గా పని చేస్తుంది. రెండు వెర్షన్లలో ఒకటి 180 వాట్లు, మరొకటి 280 వాట్ల శక్తిని అందిస్తుంది. -
ఏఎండీ చేతికి జెడ్‌టీ సిస్టమ్స్
న్యూయార్క్: చిప్ తయారీ దిగ్గజం ఏఎండీ సర్వర్ల తయారీ కంపెనీ జెడ్‌టీ సిస్టమ్స్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు 4.9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 41,000 కోట్లు) వెచి్చంచనుంది. నగదు చెల్లింపు, షేర్ల జారీ ద్వారా జెడ్టీను సొంతం చేసుకోనున్నట్లు ఏఎండీ పేర్కొంది. దీంతో ఏఎండీ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్సీ(ఏఐ) సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. వెరసి చిప్ తయారీలో ప్రత్యర్థి కంపెనీ ఎన్విడియాతో పోటీపడేందుకు తాజా కొనుగోలు ఉపయోగపడనుంది. న్యూజెర్సీ కంపెనీ జెడ్‌టీ సిస్టమ్స్ ప్రయివేట్ కంపెనీకాగా.. క్లౌడ్ కంపెనీలకు డేటా సెంటర్లు, స్టోరేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్‌ను డిజైన్ చేసి అందిస్తోంది. డీల్ పూర్తయ్యాక ఏఎండీ డేటా సెంటర్ సొల్యూ షన్స్ బిజినెస్ గ్రూప్‌లో జెడ్‌టీ సిస్టమ్స్ చేరనుంది. -
భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి కంపెనీలు పోటాపోటీ
గాంధీనగర్: భారత్‌లో సెమీకండక్టర్ల తయారీపై దేశ, విదేశ కంపెనీలు పోటీపడుతున్నాయి. సెమీకాన్ సదస్సు వేదికగా తమ ప్రణాళికలను వెల్లడించాయి. తాము తలపెట్టిన చిప్ ఫ్యాక్టరీ తొలి దశ రెండున్నరేళ్లలో సిద్ధమవుతుందని వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే భాగస్వాములను ఎంపిక చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తొలి దశపై 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 2.5 ఏళ్లలో వేదాంత తయారు చేసిన మేడిన్ ఇండియా చిప్‌ను అందించబోతున్నాం‘ అని అగర్వాల్ చెప్పారు. 20 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ల ప్లాంటు కోసం వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అటు భారత్‌లో చిప్‌ల తయారీ వ్యవస్థలోకి ప్రవేశించాలంటే ’అత్యంత సాహసికులై’ ఉండాలని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు పేర్కొన్నారు. వేదాంత జాయింట్ వెంచర్ గురించి ప్రస్తావించకుండా, ఇక్కడ ఎదురయ్యే ప్రతి అనుభవం.. కంపెనీలను మరింత దృఢంగా మారుస్తాయని ఆయన చెప్పారు. ఏఎండీ డిజైన్ సెంటర్.. మరోవైపు, వచ్చే అయిదేళ్లలో భారత్‌లో 400 మిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్‌మాస్టర్ తెలిపారు. బెంగళూరులో తమ కంపెనీకి సంబంధించి అతి పెద్ద డిజైన్ సెంటర్‌ను 5,00,000 చ.అ. విస్తీర్ణంలో ఈ ఏడాది ఆఖరు నాటికి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అయిదేళ్ల వ్యవధిలో 3,000 పైచిలుకు ఇంజనీరింగ్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేపర్‌మాస్టర్ పేర్కొన్నారు. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో భారత్‌లో తమ కార్యకలాపాలు పది ప్రాంతాలకు విస్తరించినట్లవుతుందని చెప్పా రు. భారత్‌లో ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ డిజైన్, ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడంలో ఏఎండీ ప్రణాళికలు కీలకపాత్ర పోషించగలవని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్లో ట్వీట్ చేశారు. చిప్ ప్లాంటుకు జోరుగా కసరత్తు: మైక్రాన్ గుజరాత్లో తమ చిప్ ప్లాంటు ఏర్పాటుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు అమెరికన్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ సంజయ్ మెహరోత్రా తెలిపారు. దీనితో రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించగలదని ఆయన పేర్కొన్నారు. -
టాటా గ్రూప్ భారీ ప్లాన్.. చైనాకు వేల కోట్ల నష్టం!
దేశంలో సెమీకండక్టర్ల తయారీ కోసం టాటా గ్రూప్ భారీ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చీప్ కొరత ఉంది. ఈ అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని టాటా చూస్తుంది. సెమీకండెక్టర్ల అసెంబ్లీ & టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 300 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టాటా గ్రూప్ మూడు రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల తెలిపాయి. సెమీకండెక్టర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు కొన్నాళ్ల క్రితం టాటా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్చలు గనుక సఫలం అయితే, ఈ 3 రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ & టెస్టింగ్ (ఓఎస్ఏటీ) ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ఓఎస్ఏటీ ప్లాంట్‌లో తయారైన సిలికాన్ వేఫర్లను అసెంబ్లింగ్, పరీక్షలు, ప్యాకింగ్ వంటివి చేస్తారు. ఇక్కడే అవి పూర్తి స్థాయి సెమీకండెక్టర్లు రూపొందుతాయి. వచ్చే నెల చివరి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ప్రదేశాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు తెలిపాయి. టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' డ్రైవ్‌ను బలపరుస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణాసియా దేశాన్ని స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో రెండవ అతిపెద్ద సెమీకండెక్టర్స్ తయారీదారుగా మార్చడానికి సహాయపడింది. చైనాకు వేల కోట్లలో నష్టం ప్రస్తుతం చైనాలో భారీగా సెమీకండెక్టర్ చిప్స్ తయారు అవుతున్నాయి. ఇక్కడి నుంచి అనేక దేశాలకు చిప్స్ ఎగుమతి అవుతున్నాయి. అయితే, టాటా గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టు వల్ల చైనాకు వేల కోట్లలో నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. టాటా ఓఎస్ఏటీ వ్యాపారం కోసం ఇంటెల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఎఎమ్డి), ఎస్ టి మైక్రోఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలతో చర్చలు జరుపుతుంది. ఈ కర్మాగారం వచ్చే ఏడాది చివరలో కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, 4,000 మంది కార్మికులను నియమించుకొనున్నట్లు సమాచారం. -
భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా?
Semiconductor Manufacturing: కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చైనాకు భారీగా నష్టాలు కలిగించే అవకాశాలు ఉన్నాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కొరతను అధిగమించడానికి భారత్ ప్రయత్నిస్తుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి భారతదేశం మెగా మల్టీ-బిలియన్-డాలర్ క్యాపిటల్ సపోర్ట్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చిప్ కొరత కారణంగా అన్నీ రంగాలలోని పరిశ్రమలు భారీ ఉత్పత్తి కోతలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. టీఓఐ నివేదికప్రకారం, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), ఇంటెల్, ఎఎమ్‌డీ, యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్ప్, ఫుజిట్సు వంటి కొన్ని అగ్ర సెమీకండక్టర్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. సెమీకండక్టర్ తయారీదారులను వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలనే ప్రధానమంత్రి కార్యాలయం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. కంపెనీలను దేశంలోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన విధానంతో ముందుకు రావాలని బహుళ మంత్రిత్వ శాఖలు ఆదేశించింది. ప్రత్యేక ప్రోత్సాహకాలు సెమీకండక్టర్ తయారీదారులకు దిగుమతి వస్తువులపై సుంకం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ & సెమీకండక్టర్(ఎస్ఎసీఎస్), తయారీని ప్రోత్సహించే పిఎల్ఐ స్కీం వంటి పథకాల నుంచి కూడా ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను అందించాలని చూస్తుంది. దేశంలో సెమీకండక్టర్లను తయారు చేయకపోవడంతో దేశంలోని డిమాండ్ తీర్చడం కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. భారతదేశంలో సెమీకండక్టర్ల డిమాండ్ 2025 నాటికి ప్రస్తుతం ఉన్న 24 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకొనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. చైనాకు దెబ్బ సెమీకండక్టర్ తయారీదారులను దేశానికి ఆకర్షించడానికి ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, రక్షణ & ఆటో వంటి ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అవసరాలు కంపెనీలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు దేశంలో పెట్టుబడులు వస్తే మాత్రం చైనాకు దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ల ఎగుమతి దేశంగా చైనా ఉంది. మన దేశంలో ఏర్పాటు కాబోయే ఈ పరిశ్రమ వల్ల ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. -
ఏఎండీఈఆర్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(ఏఎండీఈఆర్).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ అసిస్టెంట్–03, ప్రాజెక్ట్ అసోసియేట్–09. ► ల్యాబొరేటరీ అసిస్టెంట్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 06.08.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.20,000+హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► ప్రాజెక్ట్ అసోసియేట్: విభాగాలు: జియాలజీ, జియోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 06.08.2021 నాటికి 27ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.31,000+హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్(ఆర్) అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(ఏఎండీ), 1–10–153–156, ఏఎండీ కాంప్లెక్స్, బేగంపేట్, హైదరాబాద్–500016, తెలంగాణ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 06.08.2021 ► వెబ్సైట్: https://www.amd.gov.in/app16/index.aspx ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో 20 ఖాళీలు సికింద్రాబాద్‌లోని మనోవికాస్ నగర్లో భారత ప్రభుత్వ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్(ఎన్ఐఈపీఐడీ).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 20 ► పోస్టుల వివరాలు: ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్(రెగ్యులర్)–04, ఎంఎస్‌ఈసీ, నోయిడా (రెగ్యులర్)–01, సీఆర్సీ, దావెనగర్(రెగ్యులర్)–02, సీఆర్సీ, నెల్లూరు(ఏపీ)–09, సీఆర్సీ, రాజ్‌నందగావ్(ఛత్తీస్‌గఢ్)–04. (ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్ బంపర్ ఆఫర్..!) ► ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్ (రెగ్యులర్): పోస్టులు: లెక్చరర్(రిహేబిలిటేషన్ సైకాలజీ, ఒకేషనల్ కౌన్సెలింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్), జూనియర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, స్టెనోగ్రాఫర్. ► ఎంఎస్‌ఈసీ, నోయిడా(రెగ్యులర్): ప్రిన్సిపల్. ► సీఆర్సీ, దావెనగర్(రెగ్యులర్): పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్(మెడికల్ పీఎంఆర్), ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్. ► సీఆర్సీ, నెల్లూరు(ఏపీ): పోస్టులు: డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొస్థెటస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, క్లినికల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేటర్, వర్క్‌షాప్ సూపర్వైజర్, క్లర్క్. ► సీఆర్సీ, రాజ్‌నందగావ్(చత్తీస్‌గఢ్): పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పెషల్ ఎడ్యుకేటర్/ఓరియంటేషన్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్, ప్రొస్థెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, రిహేబిలిటేషన్ ఆఫీసర్. అర్హత ► లెక్చరర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎంఫిల్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఏ, ఎంఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 45ఏళ్లు మించకూడదు. ► జూనియర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్: గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్/బీఈడీ/బీఆర్ఎస్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు. ► స్టెనోగ్రాఫర్: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18–28ఏళ్లు మించకూడదు. ► ప్రిన్సిపల్: మాస్టర్స్ డిగ్రీ, ఎంఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 45ఏళ్లు మించకూడదు. ► అసిస్టెంట్ ప్రొఫెసర్లు: ఎంబీబీఎస్, పీజీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 45ఏళ్లు మించకూడదు. ► ఓరియేంటేషన్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్: గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ► దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021 ► వెబ్సైట్: https://niepid.nic.in -
ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల
తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్.. ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ ‘ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13’ను అభివృద్ధి చేసింది. దీంతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన జిఫిరస్ సిరీస్‌లో మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. 13 అంగుళాలతో ఏఎండీ రైజెన్ 5900హెచ్ఎస్, 5900హెచ్ఎక్స్ ప్రాసెసర్లతో కూడిన ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13 ల్యాప్‌టాప్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్ఓజీ జెఫిరస్ డ్యూయో 15 ఎస్ఈ, జీ14, జీ15 మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌ల ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతాయని పేర్కొంది. ఆసుస్ ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13 విండోస్ 10 ల్యాప్‌టాప్ మీ రోజువారీ అవసరాల కోసం 13.4 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఎమ్ డీ ఆక్టా కోర్ రైజెన్ 9 5900 హెచ్ఎస్ ప్రాసెసర్ ఉంది, దీనితో పాటు 16 జిబి ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డి స్టోరేజ్ ఉంది. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికొస్తే, ఇందులో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టిఎక్స్ 1650 గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఇది 1.3 కిలోల బరువు ఉంటుంది. దీని ధర భారతదేశంలో 1,19,990 రూపాయలు. చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
ఫెడ్ పుష్- యూఎస్ మార్కెట్లు ప్లస్
అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసిన విధంగానే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0-0.25 శాతం స్థాయిలో కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఫెడ్ పరపతి సమావేశాలు బుధవారం ముగిశాయి. లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక రికవరీ కనిపిస్తున్నప్పటికీ కోవిడ్-19కు ముందు పరిస్థితులతో పోలిస్తే బాగా వెనకబడి ఉన్నట్లు ఫెడ్ పేర్కొంది. ఇటీవల తిరిగి కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో నిరుద్యోగిత పెరగడం వంటి పలు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేసింది. అయితే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అన్నిరకాలుగా చేయూతను అందించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ తాజాగా తెలియజేశారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండేళ్ల కనిష్టానికి చేరింది. 2018 జూన్ తదుపరి 93.17ను తాకింది. లాభాల్లో ఫెడ్ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో బుధవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్ 160 పాయింట్లు(0.6 శాతం) బలపడి 26,540కు చేరగా.. ఎస్అండ్పీ 40 పాయింట్ల(1.25 శాతం) పుంజుకుని 3,258 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 141 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 10,543 వద్ద నిలిచింది. ప్రధానంగా నేడు క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్న యాపిల్, అల్ఫాబెట్, ఫేస్బుక్, అమెజాన్ 2-1 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో టెస్లా సైతం 1.5 శాతం లాభపడింది. స్టార్‌బక్స్ ప్లస్ 2020 పూర్తి ఏడాదికి ఆశావహ అంచనాలు ప్రకటించడంతో తాజాగా అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఏఎండీ) కౌంటర్‌కు డిమాండ్ ఏర్పడింది. వెరసి చిప్ తయారీ దిగ్గజం ఏఎండీ షేరు 12.5 శాతం దూసుకెళ్లింది. కొద్ది రోజులుగా బిజినెస్ పుంజుకుంటున్నట్లు ప్రకటించడంతో కాఫీ చైన్ దిగ్గజం స్టార్‌బక్స్ కార్ప్ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసింది. అయితే రెండు ఇంజిన్ల జెట్ విమానాల ఉత్పత్తిని తగ్గించినట్లు వెల్లడించడంతో బ్లూచిప్ కంపెనీ బోయింగ్ ఇంక్ షేరు 3 శాతం క్షీణించింది. ఆసియా అటూఇటూ ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సింగపూర్ 1.8 శాతం నష్టపోగా.. తైవాన్, హాంకాంగ్ 1.2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇతర మార్కెట్లలో కొరియా, ఇండొనేసియా 0.2 శాతం చొప్పున బలపడగా.. థాయ్‌లాండ్ 0.4 శాతం నీరసించింది. జపాన్ స్వల్ప నష్టంతోనూ చైనా నామమాత్ర లాభంతోనూ కదులుతున్నాయి. -
వారాంతాన యూఎస్ మార్కెట్లు డౌన్
చైనాతో వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీనికితోడు క్యూ2 ఫలితాలు నిరాశపరచడంతో సెంటిమెంటు బలహీనపడింది. దీంతో శుక్రవారం డోజోన్స్ 182 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 26.,470కు చేరగా.. ఎస్అండ్పీ 20 పాయింట్ల(0.6 శాతం)వెనకడుగుతో 3,216 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ సైతం 98 పాయింట్ల(1 శాతం) నష్టంతో 10,363 వద్ద స్థిరపడింది.క్యూ2(ఏప్రిల్-జూన్)లో క్రెడిట్ కార్డ్స్ దిగ్గజం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆదాయం 29 శాతం క్షీణించింది. మరోపక్క కోవిడ్-19 నేపథ్యంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న 7నానోమీటర్ చిప్స్ ఏడాది ఆలస్యంగా అందుబాటులోకి రానున్నట్లు చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్వెల్లడించింది. వెరసి 2022 చివర్లో లేదా 2023లో మాత్రమే ఈ ఆధునిక చిప్స్‌ను విడుదల చేయగలమని పేర్కొంది. అమెక్స్ డీలా బ్లూచిప్ దిగ్గజాలలో ఇంటెల్ కార్ప్ షేరు 16 శాతంపైగా కుప్పకూలి 50.6 డాలర్ల వద్ద ముగిసింది. ఆధునిక 7నానోమీటర్ చిప్ తయారీని ఆలస్యం చేయనున్నట్లు పేర్కొనడం ప్రభావం చూపింది. దీంతో ప్రత్యర్ధి సంస్థ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఏఎండీ)షేరుకి జోష్ వచ్చింది. 16.5 శాతం దూసుకెళ్లి 69 డాలర్లను తాకింది. మరోపక్క వైర్లెస్ సేవల దిగ్గజం వెరిజాన్ 2 శాతం పుంజుకుని 57 డాలర్లకు చేరింది. ఇక బ్యాంకింగ్ దిగ్గజం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేరు 1.4 శాతం నష్టంతో 95.3 డాలర్ల వద్ద ముగిసింది. ఫాంగ్ స్టాక్స్‌లో ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ 0.5 శాతం చొప్పున నీరసించగా.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. -
ఏఎమ్‌డీ నూతన డైరెక్టర్‌గా ఎమ్.బి.వర్మ
సాక్షి, హైదరాబాద్ : ఏఎమ్‌డీ(అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్) సంస్థకు నూతన డైరెక్టర్‌గా సైంటిఫిక్ ఆఫీసర్ ఎమ్.బి.వర్మ మంగళవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఏఎమ్‌డీ సంస్థ డీఏఈ (డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ) పరిధిలో పని చేస్తుంది. గతంలో ఎమ్.బి. వర్మ ఇదే సంస్థలో అడిషనల్ డైరెక్టర్‌గా పని చేశారు. వర్మ సైంటిఫిక్ ఆఫీసర్ హెచ్ ఫ్లస్ హోదాలో ఉన్నారు. ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘడ్ ముస్లిమ్ యూనివర్సిటీ నుంచి భూవిజ్ఞాన శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని, ఎమ్.ఫిల్ డిగ్రీని పొందారు. 1982లో ఏఎమ్డీలో చేరారు. అటామిక్ మినరల్స్ అన్వేషణలో వర్మకు విశేష అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మల పల్లి, కొప్పునూరు, తెలంగాణలోని పెద్దగట్టు, చిట్యాల్‌లో యూనిరేయం వనరులను వృద్థి చేయడంలో వర్మ కీలక పాత్ర పోషించారు. జార్ఖండ్ రాష్ట్రంలో యూనేరియం నిక్షేపాలు వెలికితీయడంలో కూడా వర్మ విశేష కృషి చేశారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల యూరేనియం వనరుల కోసం చేసిన కృషికిగాను ఆయనకు భారత గనుల మంత్రిత్వ శాఖ అందించే భూ విజ్ఞాన శాస్త్ర పురస్కారం లభించింది. -
భారత్‌లో ఉద్యోగ నియామకాలు
న్యూయార్క్ : అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఏఎండీ (అడ్వాన్స్ మైక్రో డివైజెస్) భారత్‌లో ఉద్యోగాల నియామకాలకు ప్లాన్చేస్తోంది. ఇప్పటికే భారత్‌లో 1,300 మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ సంస్థ, తన రెండు ఆర్ అండ్ డీ సెంటర్లు బెంగళూరు, హైదరాబాద్‌లలో మరింత మంది ఇంజనీర్లను నియమించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతమున్న సెంటర్లలో మరింత వృద్ధి కొనసాగించాలనుకుంటున్నామని, ప్రతి సైట్లో ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నామని ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జిమ్ ఆండర్సన్ చెప్పారు. అయితే ఎన్ని ఉద్యోగాలు కల్పించనుందో మాత్రం ఏఎండీ స్పష్టంచేయలేదు. కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను ఏమన్నా ఏర్పాటుచేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా అలాంటి ప్రణాళికలేమీ ప్రకటించలేదన్నారు. ప్రస్తుత సెంటర్లనే బలోపేతం చేయాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఎక్కువ అడ్వాన్ ఇంజనీరింగ్ పని ఇక్కడే జరుగుతున్న కారణంతో ఈ సెంటర్లను బలోపేతం చేయాలకుంటున్నట్టు తెలిపారు. ఏఎండీ రైజెన్ మొబైల్ ప్రాసెసర్ కోసం ఎక్కువ ఇంజనీరింగ్ పని హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఏఎండీకి భారత్ అత్యంత కీలకమైన మార్కెట్‌గా ఉంది. పీసీ వ్యాపారాలకు ఇది అతిపెద్ద మార్కెట్ అని ఆండర్సన్ చెప్పారు. కొత్త ఉత్పత్తులతో తన మార్కెట్ షేరును మరింత పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారుల పీసీల కోసం రైజెన్ 3, 5, 7లను కంపెనీ లాంచ్ చేసింది. కమర్షియల్ పీసీల కోసం రైజెన్ ప్రొ అనే కొత్త మైక్రోప్రాసెసర్ చిప్స్‌ను గతవారంలోనే ఏఎండీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.