డీల్ విలువ రూ. 41,000 కోట్లు
న్యూయార్క్: చిప్ తయారీ దిగ్గజం ఏఎండీ సర్వర్ల తయారీ కంపెనీ జెడ్‌టీ సిస్టమ్స్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు 4.9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 41,000 కోట్లు) వెచి్చంచనుంది. నగదు చెల్లింపు, షేర్ల జారీ ద్వారా జెడ్‌టీను సొంతం చేసుకోనున్నట్లు ఏఎండీ పేర్కొంది. దీంతో ఏఎండీ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్సీ(ఏఐ) సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి.
వెరసి చిప్ తయారీలో ప్రత్యర్థి కంపెనీ ఎన్‌విడియాతో పోటీపడేందుకు తాజా కొనుగోలు ఉపయోగపడనుంది. న్యూజెర్సీ కంపెనీ జెడ్‌టీ సిస్టమ్స్ ప్రయివేట్ కంపెనీకాగా.. క్లౌడ్ కంపెనీలకు డేటా సెంటర్లు, స్టోరేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్‌ను డిజైన్ చేసి అందిస్తోంది. డీల్ పూర్తయ్యాక ఏఎండీ డేటా సెంటర్ సొల్యూ షన్స్ బిజినెస్ గ్రూప్‌లో జెడ్‌టీ సిస్టమ్స్ చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment