న్యూఢిల్లీ: చిప్‌ల తయారీ దిగ్గజం క్వాల్‌కామ్ సీఈవో క్రిస్టియానో ఆర్ ఎమోన్, అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ సోమవారం సమావేశమయ్యారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు మొదలైన వాటి పాత్ర గురించి ఈ సందర్భంగా చర్చించినట్లు సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో అదానీ పోస్ట్ చేశారు. చెన్నైలో రూ. 177 కోట్లతో ఏర్పాటు చేసిన కొత్త డిజైన్ సెంటర్‌ను మార్చి 14న ఎమోన్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
వై–ఫై టెక్నాలజీలకు అనుబంధ ఆవిష్కరణలు లక్ష్యంగా కొత్త సెంటర్ వైర్‌లెస్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఈ సెంటర్ రూపొందించనుంది. మరోవైపు, తమ సొంత పోర్టులు, లాజిస్టిక్స్, విద్యుదుత్పత్తి తదితర విభాగాల అవసరాల కోసం స్వల్ప మొత్తంలో తీసుకున్న 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి ఉపయోగపడే సొల్యూషన్స్ కోసం అదానీ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్టియానో, అదానీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment