భారత్‌లో ఇంటెల్ భారీ పెట్టుబడులు
సాక్షి, బెంగళూరు: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆర్‌అండ్‌డీపై బెంగళూరులో అత్యాధునిక డిజైన్ హౌస్ నిర్మాణానికి రూ. 1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది. దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పటిష్టం కావడానికి, అపార ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ స్థాయి పెట్టుబడులు దోహదపడగలవని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్య మంత్రి సిద్ధరామయ్య చెప్పారు.