అరచేతిలో ఎన్‌యూపీసీలు | Microsoft and Intel collaborated to bring NuPC | Sakshi
Sakshi News home page

అరచేతిలో ఎన్‌యూపీసీలు

Published Sat, May 30 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

అరచేతిలో ఎన్‌యూపీసీలు

అరచేతిలో ఎన్‌యూపీసీలు

అరచేతిలో ఇమిడిపోయే ఎన్‌యూపీసీని ఇంటెల్, మైక్రోసాఫ్ట్, డబ్ల్యూపీజీలు సంయుక్తంగా అందిస్తున్నాయి.

ఇంటెల్, మైక్రోసాఫ్ట్, డబ్ల్యూపీజీ భాగస్వామ్యం
హైదరాబాద్:  అరచేతిలో ఇమిడిపోయే ఎన్‌యూపీసీని ఇంటెల్, మైక్రోసాఫ్ట్, డబ్ల్యూపీజీలు సంయుక్తంగా అందిస్తున్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ రెండు, ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్‌తో రెండు ఎన్‌యూపీసీలను అందిస్తున్నట్లు ఈ మూడు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో కూడిన 2జీబీ మెమెరీ, 500 జీబీ స్టోరేజ్ ఉన్న ఎన్‌యూపీసీ ధర రూ.29,000 అని, 4 జీబీ మెమెరీ, టెర్రాబైట్ స్టోరేజ్ ఉన్న దాని ధర రూ.32,999 అని ఇంటెల్ డెరైక్టర్ (సౌత్ ఏషియా సేల్స్) రాజీవ్ భల్లా పేర్కొన్నారు.

ఇక ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్‌తో కూడిన 2 జీబీ మెమెరీ, 500 జీబీ స్టోరేజ్ ఉన్న దాని ధర రూ.18,999 అని, 4 జీబీ మెమెరీ, 1 టెర్రాబైట్ స్టోరేజ్ ఉన్న దాని ధర రూ.21,999 అని ఈ సందర్భంగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement