ఇంటెల్ చేతికి భారత సంతతి వ్యక్తి స్టార్టప్
డీల్ విలువ 40.8 కోట్ల డాలర్లు !
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటెల్ సంస్థ.. కాలిఫోర్నియాకు చెందిన లెర్నింగ్ స్టార్టప్ నిర్వాణ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసింది. దీంతో చిప్‌లు తయారుచేసే ఇంటెల్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) రంగంలోకి ప్రవేశించినట్లయింది. ఈ నిర్వాణ సిస్టమ్స్‌ను భారత సంతతి ఎంటర్‌ప్రెన్యూర్ నవీన్‌రావు 2014లో ప్రారంభించారు. డీల్ విలువ నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ, ఈ స్టార్టప్‌ను 40.8 కోట్ల డాలర్లకు ఇంటెల్ కొనుగోలు చేసిందని టెక్నాలజీ న్యూస్ వెబ్‌సైట్ రికోడ్ తెలిపింది.