ఇంటెల్ చేతికి మొబైల్‌ఐ
15 బిలియన్ డాలర్ల డీల్
న్యూయార్క్: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ తాజాగా ఇజ్రాయెల్‌కి చెందిన సెన్సర్ కంపెనీ మొబైల్–ఐని కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు 15.3 బిలియన్ డాలర్లు. మొబైల్‌ఐ .. కార్ల తయారీ సంస్థలకు సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్‌ను సరఫరా చేస్తుంది. రెండు కంపెనీల సంయుక్త ప్రకటన ప్రకారం మొబైల్‌ఐ షేరు ఒక్కింటికి 63.54 డాలర్ల చొప్పున ఇంటెల్ ఆఫర్ చేసింది. శుక్రవారం నాటి మొబైల్‌ఐ షేరు ధర 47.27 డాలర్లతో పోలిస్తే ఇది 34.5 శాతం అధికం. వచ్చే తొమ్మిది నెలల్లో డీల్ పూర్తి కాగలదని ఇంటెల్ పేర్కొంది.
సుమారు 40 సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ కార్ల తయారీకి సంబంధించి ఈ రెండు సంస్థలు ఇప్పటికే జర్మనీ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూతో కలసి పనిచేస్తున్నాయి. 1999లో ఏర్పాటైన మొబైల్‌ఐ 2007లో గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ నుంచి 130 మిలియన్ డాలర్స్ సమీకరించింది. 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో లిస్టయింది.