ఇంటెల్ ఉద్యోగాల్లో కోత! | Intel plans to cut thousands of jobs: Report | Sakshi
Sakshi News home page

ఇంటెల్ ఉద్యోగాల్లో కోత!

Published Sun, Apr 17 2016 10:06 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

ఇంటెల్ ఉద్యోగాల్లో కోత!

ఇంటెల్ ఉద్యోగాల్లో కోత!

న్యూయార్క్: అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ ఈ ఏడాది ఉద్యోగులకు కోత పెట్టనుంది. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గటం ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది చివరికల్లా 1100 మందికి పైగా ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు వినవస్తోంది.

ఈ ఏడాది తొలి ఆర్థిక త్రైమాసిక ఫలితాలను ఈ నెల 19న వెల్లడించనుండటంతో అప్పటికల్లా ఉద్యోగాల కోతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 1,07,000 మంది ఈ సంస్థలో వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ప్రెసిడెంట్ రెనాఈ జేమ్స్ సంస్థను వదిలారు. ఆ స్థానాన్ని ప్రస్తుతం ప్రత్యర్థి సంస్థ క్వాల్‌కామ్‌కు చెందిన వెంకట మూర్తి రెండుచింతల భర్తీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement