job cut
-
గూగుల్ హిస్టరీ ప్రింట్ తీసి.. జాబ్ నుంచి తీసేసిన కంపెనీ
కొందరు తమ తెలితక్కువ పనులతో ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటారు. ఇలాగే యూకేలో ఉద్యోగి గూగుల్ హిస్టరీని ప్రింట్ తీసి మరీ అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది ఓ కంపెనీ. అతను గూగుల్‌లో వెతికింది అశ్లీల విషయాలు మాత్రం కాదు. మరి ఏం సెర్చ్ చేశాడు.. దీని వల్ల పడిన ఇబ్బందులేంటి అన్నది స్వయంగా అతడే ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.‘మిర్రర్స్’ నివేదిక ప్రకారం.. యూకేకి చెందిన జోస్ విలియమ్స్ అనే 26 ఏళ్ల యువకుడు ఓ కంపెనీలో కస్టమర్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్‌గా చేరాడు. పెద్దగా పనులేవీ అప్పగించకపోవడంతో అతడు ఆఫీస్ కంప్యూటర్లో "టర్కీ దంతాలు", "సైమన్ కోవెల్ బాచ్డ్ బొటాక్స్" వంటి అనవసర వాటి కోసం శోధించాడు. అతని ప్రవర్తనను గమనించిన బాస్ ఆఫీస్ కంప్యూటర్లో అతడు ఏమేం సెర్చ్ చేశాడన్నది మొత్తం 50 గంటల హిస్టరీని ప్రింట్ తీసి మందలించి ఉద్యోగంలోంచి తీసేశారు.దీని గురించి విలియమ్స్ టిక్‌టాక్ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో తాను చాలా ఇబ్బందులు పడ్డానని, మూడు కంపెనీలు జాబ్ రిజక్ట్ చేశాయని చెప్పుకొచ్చాడు. జాబ్ లేకపోవడంతో డబ్బులు లేక ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాన్నాడు. అయితే అతను టిక్‌టాక్ పెట్టిన ఈ వీడియోకు మాత్రం 450 పౌండ్లు (రూ.50 వేలు) దాకా డబ్బులు రావడం గమనార్హం. కంటెంట్ క్రియేషన్‌లో అభిరుచి ఉన్న విలియమ్స్ ప్రస్తుతం ఫుడ్ ఇండస్ట్రీలో సప్లయి చైన్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. -
మెర్సీ ప్లీజ్!
‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్’’ అని అడుగుతోంది డాక్టర్ పార్వతీ కుమారి. జార్ఖండ్‌లోని చిన్న నగరం ధన్‌బాద్. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి. కళ్లు తెరిచింది కానీ.... స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్ కంటి డాక్టర్‌కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు. పీహెచ్డీ దాకా... అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్‌రామ్ కాలేజీలో ఎమ్.ఏ. చేసింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్‌ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్‌ఎఫ్‌గా సెలక్ట్ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది. పుంజుకునేలోపే... కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి. కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మినెంట్ చేసే సమయం వచ్చింది. తాను కూడా పర్మినెంట్ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది. ‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్‌గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది? -
ఆ ప్రబుద్ధుడి ఉద్యోగం ఊడింది
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైవాసి శంకర్ మిశ్రాపై అతడు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం వేటు వేసింది. ఉద్యోగంలోనుంచి తొలగించింది. శంకర్ మిశ్రా వెల్స్ ఫార్గో అనే బహుళజాతి సంస్థలో ఇండియా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. తమ సంస్థలో పనిచేసే సిబ్బంది వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ హుందాగా ప్రవర్తించాలని తాము కోరుకుంటున్నామని వెల్స్ ఫార్గో్గ ఒక ప్రకటనలో వెల్లడించింది. శంకర్ మిశ్రా చేసిన పని తమకు తలవంపులు తెచ్చిందని పేర్కొంది. కేసు పెట్టొద్దని వేడుకున్నాడు విమానంలో ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తీవ్ర అవమానం జరిగిందని, నిందితుడి ముఖం చూడాలంటే అసహ్యం వేసిందని బాధితురాలు వెల్లడించారు. కేసు పెట్టొద్దని వేడుకున్నాడని, క్షమాపణ కోరాడని చెప్పారు. -
నోకియా సంచలన నిర్ణయం..
హెల్సింకి: వైర్లెస్ నెట్వర్క్ రంగంలో ఉన్న దిగ్గజ సంస్థ నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది. 10,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. నాలుగు ప్రధాన వ్యాపార విభాగాల్లో ఈ కోత ఉంటుందని వెల్లడించింది. అయితే ఏ దేశంలోని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నదీ అన్న విషయాన్ని మాత్రం తెలియజేయకపోవడం గమనార్హం. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు చేసేందుకై వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. లక్ష మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా రెండేళ్లలో ఈ సంఖ్యను 80–85 వేలకు పరిమితం చేయనుంది. తద్వారా 2023 నాటికి రూ.5,200 కోట్లు ఆదా చేయాలని భావిస్తోంది. -
బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు!
మెల్బోర్న్: కరోనా వైరస్ దెబ్బ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై బాగానే పడింది. ఆర్థిక నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో బోర్డు తాజాగా 40 మందిపై వేటు వేసింది. ఈ జాబితాలో బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 65 టెస్టులు, 120 వన్డేలు ఆడిన హిక్ 2016నుంచి ఆసీస్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సీఈఓ కెవిన్ రాబర్ట్స్‌ను సాగనంపిన సీఏ తాజాగా హిక్ సేవలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ సారి అధిక వేతన భత్యాలు పొందుతున్న వారిపైనే సీఏ గురిపెట్టింది. ఈ తొలగింపులతో ఏకంగా రూ. 210 కోట్లు (4 కోట్ల ఆసీస్ డాలర్లు) భారం తగ్గుతుందని సీఏ భావిస్తోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీఏ పొదుపు చర్యల్లో భాగంగానే సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. పైగా ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌కు కూడా ఆతిథ్యమివ్వడం లేదని ప్రకటించిన మరుసటి రోజే ఇక అనవసరమనుకున్న సిబ్బందిని తొలగించింది. అలాగే అండర్–19 మినహా జూనియర్ స్థాయి, ద్వితీయ శ్రేణి క్రికెట్ టోర్నీలను షెడ్యూల్ నుంచి తప్పించింది. మరో వైపు తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపడుతున్న నిక్ హాక్లీపై ఐసీసీ మాజీ సీఈ మాల్కమ్ స్పీడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కష్టకాలంలో హాక్లీ బాధ్యతలు చేపడుతున్నాడు. సరిగ్గా చెప్పాలంటే తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్ తన తొలి ఓవర్‌ను కోహ్లిని వేస్తున్నట్లుగా అతని పరిస్థితి కనిపిస్తోంది’ అని మాల్కమ్ అన్నాడు. -
కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ క్యూ4 ఫలితాల సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 4.5 లక్షల తమ ఉద్యోగుల్లో ఎవర్నీ తీసివేయడం లేదని వెల్లడించింది. అయితే జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ సంస్థ తెలిపింది. అయితే కొత్త నియామకాలపై ఎలాంటి ప్రభావం ఉందని స్పష్టం చేసింది. ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40వేల మంది నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. (రివర్స్ రెపో రేటు పావు శాతం కోత) మార్చి త్రైమాసికంలో టీసీఎస్ ఆరోగ్యకరమైన లాభాలను నివేదించింది. క్యూ 4లో నికర లాభం 0.8 శాతం తగ్గి రూ .8,049 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రతి షేరుకు రూ .6 తుది డివిడెండ్ కూడా ప్రకటించింది. మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి, కొన్ని భారీ డీల్స్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలో కోవిడ్-19 సంక్షోభం కారణంగా ఆదాయ క్షీణించే అవకాశం ఉందని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కంపెనీ పట్ల ఉద్యోగులు చూపించిన నిబద్ధతను గోపీనాథన్ ప్రశంసించారు. ప్రస్తుతం భారతదేశంలో 355,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిలో 90 శాతం మంది ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి సురక్షితమైన కార్యాలయాలతో అనుసంధానించబడ్డారని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం తెలిపారు. మెరుగైన ఫలితాలతో శుక్రవారం నాటి మార్కెట్లో టీసీఎస్ షేరు టాప్ గెయినర్ గా వుంది. (7.4 శాతం వృద్ధిని సాధిస్తాం) చదవండి : రూపాయికి ఆర్బీఐ 'శక్తి' -
మారుతీలో 3 వేల ఉద్యోగాలు ఫట్
సాక్షి, ముంబై: ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయలేదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు. -
ఇంటెల్ ఉద్యోగాల్లో కోత!
న్యూయార్క్: అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ ఈ ఏడాది ఉద్యోగులకు కోత పెట్టనుంది. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గటం ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది చివరికల్లా 1100 మందికి పైగా ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు వినవస్తోంది. ఈ ఏడాది తొలి ఆర్థిక త్రైమాసిక ఫలితాలను ఈ నెల 19న వెల్లడించనుండటంతో అప్పటికల్లా ఉద్యోగాల కోతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 1,07,000 మంది ఈ సంస్థలో వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ప్రెసిడెంట్ రెనాఈ జేమ్స్ సంస్థను వదిలారు. ఆ స్థానాన్ని ప్రస్తుతం ప్రత్యర్థి సంస్థ క్వాల్‌కామ్‌కు చెందిన వెంకట మూర్తి రెండుచింతల భర్తీ చేశారు.