కొందరు తమ తెలితక్కువ పనులతో ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటారు. ఇలాగే యూకేలో ఉద్యోగి గూగుల్ హిస్టరీని ప్రింట్ తీసి మరీ అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది ఓ కంపెనీ. అతను గూగుల్‌లో వెతికింది అశ్లీల విషయాలు మాత్రం కాదు. మరి ఏం సెర్చ్ చేశాడు.. దీని వల్ల పడిన ఇబ్బందులేంటి అన్నది స్వయంగా అతడే ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.
‘మిర్రర్స్’ నివేదిక ప్రకారం.. యూకేకి చెందిన జోస్ విలియమ్స్ అనే 26 ఏళ్ల యువకుడు ఓ కంపెనీలో కస్టమర్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్‌గా చేరాడు. పెద్దగా పనులేవీ అప్పగించకపోవడంతో అతడు ఆఫీస్ కంప్యూటర్‌లో "టర్కీ దంతాలు", "సైమన్ కోవెల్ బాచ్డ్ బొటాక్స్" వంటి అనవసర వాటి కోసం శోధించాడు. అతని ప్రవర్తనను గమనించిన బాస్ ఆఫీస్ కంప్యూటర్‌లో అతడు ఏమేం సెర్చ్ చేశాడన్నది మొత్తం 50 గంటల హిస్టరీని ప్రింట్ తీసి మందలించి ఉద్యోగంలోంచి తీసేశారు.
దీని గురించి విలియమ్స్ టిక్‌టాక్ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో తాను చాలా ఇబ్బందులు పడ్డానని, మూడు కంపెనీలు జాబ్ రిజక్ట్ చేశాయని చెప్పుకొచ్చాడు. జాబ్ లేకపోవడంతో డబ్బులు లేక ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాన్నాడు. అయితే అతను టిక్‌టాక్ పెట్టిన ఈ వీడియోకు మాత్రం 450 పౌండ్లు (రూ.50 వేలు) దాకా డబ్బులు రావడం గమనార్హం. కంటెంట్ క్రియేషన్‌లో అభిరుచి ఉన్న విలియమ్స్ ప్రస్తుతం ఫుడ్ ఇండస్ట్రీలో సప్లయి చైన్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment