నోకియా సంచలన నిర్ణయం.. | Nokia Says To Cut Up To 10,000 Jobs In 24 Months | Sakshi

10,000 మంది ఉద్యోగులను తొలగించనున్న నోకియా

Mar 17 2021 12:25 AM | Updated on Mar 17 2021 7:59 AM

Nokia Says To Cut Up To 10,000 Jobs In 24 Months - Sakshi

హెల్సింకి: వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ రంగంలో ఉన్న దిగ్గజ సంస్థ నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది. 10,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. నాలుగు ప్రధాన వ్యాపార విభాగాల్లో ఈ కోత ఉంటుందని వెల్లడించింది. అయితే ఏ దేశంలోని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నదీ అన్న విషయాన్ని మాత్రం తెలియజేయకపోవడం గమనార్హం. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు చేసేందుకై వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.  లక్ష మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా రెండేళ్లలో ఈ సంఖ్యను 80–85 వేలకు పరిమితం చేయనుంది. తద్వారా 2023 నాటికి రూ.5,200 కోట్లు ఆదా చేయాలని భావిస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement