
ముంబై : ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ మధుర ఘటన నెటిజన్ల ముఖాలపై నవ్వులు పూయిస్తోంది. ముంబై హోటల్‌లో అక్కడి సిబ్బంది తాను ఒక్కడినే భోజనం చేస్తుండటంతో వారు ఏం చేసింది వివరిస్తూ ఇంటెల్ ఇండియా ఎండీ ప్రకాష్ మాల్యా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భోజనానికి వెళ్లగా తాను ఒక్కడినే తినడం పసిగట్టిన సిబ్బంది తనకు కంపెనీ ఇచ్చేందుకు ఓ క్యూట్ గెస్ట్‌ను తీసుకువచ్చారని వారి ఆతిథ్యాన్ని మెచ్చుకున్నారు.
తనకు కంపెనీగా ఓ గోల్డ్ ఫిష్‌ను అక్కడ ఉంచారని ఆయన ట్వీట్ చేశారు. ఫిష్ ఫోటోను షేర్ చేసిన మాల్యా హోటల్ సిబ్బంది ఆలోచనపై ప్రశంసలు కురిపించారు. తాను ఎన్నోసార్లు పలు ప్రాంతాలు సందర్శించినా ఎక్కడా తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్‌లో ఈ పోస్ట్‌కు ఇప్పటివరకూ 1400 వరకూ లైక్‌లు రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రయాణాల్లో తమకు ఎదురైన అనుభవాల గురించి వారు కామెంట్స్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment