మార్కెట్‌లోకి హోండా ‘అమేజ్’ కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.6.48 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్) తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో ప్రివిలేజ్ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.48 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.7.73 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.
కొత్త లిమిటెడ్ వెర్షన్‌లో అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదిరిపోయే ఎక్స్‌టీరియర్ సహా ఏబీఎస్ (డీజిల్ వేరియంట్), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, పవర్ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ‘కస్టమర్లకు ఉత్తమమైన ఫీచర్లను అందించడమే మా ప్రధాన లక్ష్యం. హోండా అమేజ్‌లో ప్రివిలేజ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది’ అని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.