Amaze
-
పెరగనున్న హోండా కార్ల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా వచ్చే నెల నుంచి సిటీ, అమేజ్ కార్ల ధరలను పెంచనుంది. ముడిసరుకు వ్యయం క్రమంగా అధికం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తాజాగా ప్రకటించింది. అయితే ధర ఎంత పెంచేదీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధర రూ.7.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మధ్యస్థాయి సెడాన్ సిటీ రూ.11.57 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక హైబ్రిడ్ మోడల్ అయిన సిటీ ఈ:హెచ్ఈవీ రూ.18.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
ఉద్యోగుల చేతివాటం! అప్పగించమంటే అమ్మేసుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: అమెజాన్ గోదాములకు చేర్చాల్సిన కంప్యూటర్ ఉపకరణాలను స్వాహా చేసి అమ్మేసుకున్న అమేజ్ సొల్యూషన్స్ సంస్థ ఉద్యోగులతో పాటు రిసీవర్లను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసినట్లు దర్యాప్తు అధికారిగా ఉన్న టీమ్–1 ఏసీపీ ఎం.శ్రీనివాస్‌రావు తెలిపారు. సికింద్రాబాద్‌లోని సీటీసీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆనందిత్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్ సంస్థ కంప్యూటర్ విడి భాగాలు, ఉపకరణాల వ్యాపారం చేస్తుంటుంది. ఆన్లైన్ ద్వారానూ వ్యాపారం చేస్తున్న ఈ సంస్థకు అమెజాన్‌లో ‘ఏ1 ప్రై స్ ఏ1 ప్రొడక్ట్స్’ అనే డిస్ప్లే నేమ్ నమోదై ఉంది. కస్టమర్ల ఆర్డర్లకు తగ్గట్టు ఆనందిత్ సంస్థ తమ ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెజాన్ గోదాములకు చేరుస్తుంటుంది. అక్కడి నుంచి ఈ సరుకు అమెజాన్ ద్వారా వినియోగదారులకు డెలివరీ అవుతుంది. తమ ఉత్పత్తులను నిర్ణీత ప్రమాణాలు, పరిమాణంతో ఉండే బాక్సుల్లో ప్యాక్ చేసే ఆనందిత్ సంస్థ వాటిపై షిప్మెంట్ లేబుల్‌ను అతికిస్తుంది. వీటిని ఈ సంస్థ నుంచి అమేజాన్ గోదాములకు చేర్చే బాధ్యతను ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అమేజ్ సొల్యూషన్స్ నిర్వహిస్తుంది. ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు ఆనందిత్ సంస్థ నుంచి ఆయా బాక్సులను సేకరించి భద్రంగా అమేజాన్ గోదాములకు చేరుస్తుంటారు. అమేజ్ సంస్థకు నగరానికి సంబంధించి ఉప్పల్‌లోని హెచ్ఎండీఏ లేఔట్లో ఉన్న గోదాము ద్వారా ఈ రవాణా జరుగుతుంది. ఈ సంస్థలో అనిల్‌కుమార్, మనోజ్‌కుమార్‌లు డెలివరీ బాయ్స్‌గా, నర్సింగ్ యాదవ్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నగరానికి చెందిన వ్యాపారి కృష్ణకుమార్‌తో అనిల్, మనోజ్‌లకు పరిచయం ఉంది. అమేజాన్ గోదాములకు డెలివరీ చేసే సరుకులో కొంత స్వాహా చేసి తీసుకువస్తే తాను ఖరీదు చేస్తానంటూ అతను వీరిద్దరితో చెప్పాడు. దీనికి అంగీకరించిన ద్వయం కొన్నాళ్లుగా సరుకు స్వాహా చేసి కృష్ణకు అందిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ మొదలు అమెజాన్ సంస్థ నుంచి ఆనందిత్‌కు ఈ–మెయిల్స్ రూపంలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఆర్డర్ ప్రకారం సరుకు రావట్లేదని, వచ్చిన వాటిలోనూ కొంత తక్కువ ఉంటోందని వాటి సారాంశం. ఈ నేపథ్యంలో ఆనందిత్ సంస్థ లోతుగా ఆరా తీయగా రూ.1.35 కోట్ల విలువైన 4262 బాక్సులు, సరుకు గల్లంతైనట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిని దర్యాప్తు చేసిన అధికారులు అనిల్‌కుమార్, మనోజ్‌కుమార్‌లతో పాటు కృష్ణకుమార్‌ను అరెస్టు చేశారు. వీరి సరుకు చోరీ చేస్తున్నారని తెలిసినా యాజమాన్యానికి ఫిర్యాదు చేయని డ్రైవర్ నర్సింగ్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణ నేపథ్యంలోనే సరుకు మొత్తం అమీర్‌పేట, సికింద్రాబాద్‌ల్లో ఉన్న ఐదుగురు సెల్‌ఫోన్, కంప్యూటర్ దుకాణదారులకు విక్రయించినట్లు తేలింది. దీంతో వీరినీ నిందితులుగా పరిగణిస్తూ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రూ.లక్షల విలువైన కంప్యూటర్ విడి భాగాలు రికవరీ చేశారు. ఫిర్యాదుదారులు పేర్కొన్న స్థాయిలో సరుకు చోరీ జరగలేదని భావిస్తున్నారు. దీన్ని నిర్థారించే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. (చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి) -
బీఎస్-6 : హోండా అమేజ్.. సరికొత్తగా
సాక్షి, న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ హోండా తన పాపులర్ మోడల్ కారు హోండా అమేజ్‌లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తొలి మోడల్‌కారు ‘అమేజ్ 2020’ని లాంచ్ చేసింది. దీని ప్రారంభధరను. 6.09 లక్షలుగా(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. 1.5 లీటర్ల ఐ-డీటెక్ డీజిల్ ఇంజీన్, 1.2 లీటర్ల ఇంజన్లీతో మాన్యువల్, సీవీటీ రెండు వెర్షన్లలోనూ ప్రారరంభించింది. హ్యుందాయ్ ఆరా, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టాటా టిగోరేకి గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
హోండా కార్ల ధరలు పెంపు!
న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా తన మోడల్స్‌పై ధరలను పెంచింది. వచ్చే నెల నుంచి తన మోడల్స్‌పై 35 వేల రూపాయల వరకు ధరలు పెరగనున్నట్టు హోండా కార్స్ ప్రకటించింది. ఇన్పుట్ కాస్ట్‌లు పెరగడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 10 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు ధరలను పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తుందని, ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) ప్రకటించింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడం, గత కొన్ని నెలలుగా కస్టమ్స్ డ్యూటీల ప్రభావం, ఎక్కువ ఫ్రైట్ రేట్లు వంటివి తమ కార్ల ధరలను పెంచేలా ప్రభావితం చేశాయని హెచ్‌సీఐఎల్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ చెప్పారు. ఇటీవల లాంచ్ చేసిన కొత్త అమేజ్ ధరను కూడా ఆగస్టు నుంచి సమీక్షించనున్నట్టు పేర్కొన్నారు. హెచ్‌సీఐఎల్ తన మోడల్స్ హ్యాచ్‌బ్యాక్ బ్రియోను ప్రారంభ ధర రూ.4.73 లక్షలకు అందిస్తుండగా.. అకార్డు హైబ్రిడ్‌ను రూ.43.21 లక్షలకు విక్రయిస్తోంది. ఈ రేంజ్లో హోండా కార్లు మార్కెట్లో ఉన్నాయి. ఏప్రిల్‌లో లగ్జరీ కారు తయారీదారులు ఆడి, జేఎల్ఆర్, మెర్సిడెస్ బెంజ్‌లు కూడా లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో ధరలను పెంచాయి. కస్టమ్ డ్యూటీలు పెరగడంతో, తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. హ్యుందాయ్ మోటార్స్ కూడా జూన్ నుంచి 2 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. ఇలా కార్ల సంస్థలు తమ మోడల్స్‌పై ధరల పెంపును ప్రకటిస్తున్నాయి. -
మార్కెట్లోకి హోండా ‘అమేజ్’ కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.6.48 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్) తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో ప్రివిలేజ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.48 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.7.73 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కొత్త లిమిటెడ్ వెర్షన్లో అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అదిరిపోయే ఎక్స్టీరియర్ సహా ఏబీఎస్ (డీజిల్ వేరియంట్), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, పవర్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ‘కస్టమర్లకు ఉత్తమమైన ఫీచర్లను అందించడమే మా ప్రధాన లక్ష్యం. హోండా అమేజ్‌లో ప్రివిలేజ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది’ అని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.