మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని, మృతుడిని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ (40) గా గుర్తించామని పోలీసులు తెలిపారు.
శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లిన మైఖేల్ ఎంతకీ బయటకు రాలేదని, సోనెగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి తెలిపారు. అతని సహచరులు వెంటనే అతనిని నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు తరలించగా పరశీలించిన వైద్యులు అతను మృతిచెందినట్లు ప్రకటించారు.
సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్షలో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది.
ఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లక్నోలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment