నేడు ఢిల్లీలో కార్మికుల రిలే నిరాహార దీక్ష
హైదరాబాద్: ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) మూసివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శనివారం రాత్రి డిపార్టుమెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి హెచ్‌సీఎల్ యూనియన్ అధ్యక్షుడికి నోటీసులు వచ్చాయి. దీంతో కార్మికుల్లో కలకలం మొదలైంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు గుండెపోటుతో ఆసుపత్రిపాలయ్యారని తెలిసింది. కేంద్రంచర్యతో 600 మంది కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయని హెచ్‌సీఎల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి.సుబ్బారావు. జి.దామోదర్‌రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాదిగా జీతాలు లేకున్నా కంపెనీని కాపాడుకునేందుకు సర్దుకుపోయామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు పునాదులు వేసిన హెచ్‌సీఎల్ కంపెనీని కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుబ్బారావు కోరారు. హెచ్‌సీఎల్ మూసివేత నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం ఢిల్లీలో ఉద్యోగ సంఘాలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. కేంద్రం మొండివైఖరిని ప్రదర్శిస్తే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 10 నుంచి 20 ఏళ్ల సర్వీస్ గల ఉద్యోగులు 60 శాతానికిపైగా ఉన్నారని పేర్కొంది. హెచ్‌సీఎల్ మూసివేసి ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం కేంద్రమంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు.
హెచ్‌సీఎల్ మూసివేతకు నోటీసులు
Published Mon, Mar 2 2015 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement